YS Jagan On Haryana : హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
Haryana Results : హర్యానా ఎన్నికల్లో ఈవీఎం గోల్ మాల్ జరిగిందని జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి బ్యాలెట్లే మంచిదని .. దేశంలో ఉన్న ప్రముఖ పార్టీలకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Jagan alleged that EVMs were rigged in Haryana elections : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హర్యానా ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో వచ్చినట్లుగానే అక్కడ కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయన్నారు. ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్లతోనే ఎన్నికలు జరుపుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగించేందుకు బ్యాలెట్లతో ఓటింగ్ జరపాలని జగన్ కోరారు. తన ట్వీట్‌ను దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు జగన్ ట్యాగ్ చేశారు.
Yet another election result confounds popular perception. Haryana election result is no different from Andhra Pradesh, on which cases are pending in courts. In a democracy like ours, Democracy should not only be prevalent but also be seen to be thriving. Only way to ensure both,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2024
ఓడిపోయినప్పటి నుండి ఈవీఎంలపై జగన్ అనుమానాలు
ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి జగన్ తాను ఓడిపోలేదని ఈవీఎంలతో ఓడించారని అనుకుంటున్నారు. అయితే 2019లో ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని ఒక వేళ తప్పని సరి అయితే వందశాతం వీవీ ప్యాట్ స్లిప్లులు లెక్కించారని అప్పట్లో చంద్రబాబు నేతృత్వంలో పలు ప్రాంతీయ పార్టీల నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి పోరాడారు.కానీ జగన్ మాత్రం చంద్రబాబు ఓడిపోతున్నారని తెలుసుకుని ఈవీఎంలపై నిందలేస్తున్నారని ఆరోపించారు. తర్వాత సుప్రీకోర్టులో చంద్రబాబు బృందానికి సానుకూల ఫలితం రాలేదు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పటికే అనేక సార్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి.
గతంలో ఈవీఎంలు ఎంత బాాగా పని చేస్తాయో వివరించిన జగన్
జగన్‌కు 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలను అనుమానించి ఉంటే ఆయన మాటల్లో కాస్తంత నిజాయితీ ఉండేదని కానీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఈవీఎంలను నిందిస్తే ఎలా అన్న ప్రశ్న వస్తోంది. ఈవీఎంలను మ్యానేజ్ చేస్తోంది బీజేపీ అనే జగన్ చెబుతున్నారు. అలా అయితే బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో తాను అనుకున్నట్లుగా నాలుగు వందల సీట్లను తెచ్చుకునేది కదా అన్న ప్రశ్నలు నెటిజన్ల నుంచి జగన్ కు ఎదురవుతున్నాయి.
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్లతోనే ఓటింగ్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి దాదాపుగా ఏడాది ముందు మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉత్తారంధ్రతో పాటు నెల్లూరు నుంచి రాయలసీమ మొత్తం జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. భారీ మెజార్టీలతో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. అవి బ్యాలెట్లతోనే జరిగాయి. మరి ఆ ఎన్నికల ఫలితాల సంగతేమిటని కొంత మంది జగన్ ను ప్రశ్నిస్తున్నారు.