Jammu Kashmir Encounter: అమిత్ షా పర్యటన వేళ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ పౌరుడు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు మృతి చెందాడు.
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ పౌరుడు మృతి చెందాడు. ఉగ్రావాదులు, సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ కాల్పులు జరిగాయి.
Around 1030 hrs unidentified terrorists attacked a Naka party of 178 Bn, CRPF at Babapora, Shopian. CRPF retaliated the fire and during cross firing one unidentified person got killed. Further details are being ascertained.@JmuKmrPolice @KashmirPolice @DigSkr
— DISTRICT POLICE SHOPIAN (@ShopianPolice) October 24, 2021
ఏం జరిగింది?
షోపియాన్ జిల్లా బాబపుర్‌లో సీఆర్‌పీఎఫ్ 178 బెటాలియన్‌కు చెందిన బృందపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులపై బలగాలు ఎదురుకాల్పులు చేయగా ఓ పౌరుడు మృతి చెందాడు. వెంటనే బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నాయి. మృతి చెందిన పౌరుడి పేరు షహిద్ అహ్మద్‌గా పోలీసులు తెలిపారు.
కాల్పుల్లో పౌరుడు చనిపోవడం ఈ నెలలో ఇది రెండోసారి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడురోజుల పాటు జమ్ము పర్యటనలో ఉన్న కారణంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఉగ్రవాదులు రెచ్చిపోయి కాల్పులు చేశారు.
కశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఆపాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు.
Also Read: Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ