ISRO INSAT 3DS: ఇస్రో మరో రికార్డు, GSLV-F14 రాకెట్ ప్రయోగం విజయవంతం
INSAT-3DS Satellite: శ్రీహరికోట నుంచి ఇస్రో INSAT 3DS శాటిలైట్‌ని విజయవంతంగా ప్రయోగించింది.
INSAT-3DS Satellite Launch: ఇస్రో INSAT 3DS శాటిలైట్‌ని విజయవంతంగా ప్రయోగించింది. GSLV-F14 రాకెట్ ద్వారా 2,275 కిలోల బరువున్న ఇన్‌శాట్-3డీఎస్‌ను నింగిలోకి పంపింది. విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితల వాతావరణాలపై ఈ ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. ఈ పరిశోధనల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇస్రోకి అందించనుంది. ఈ శాటిలైట్ పదేళ్ల పాటు ఇస్రోకి సేవలు అందిస్తుంది. దశలవారీగా విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లింది. పేలోడ్ విడిపోయిందని ఇస్రో వెల్లడించింది.
#WATCH | Andhra Pradesh: ISRO launched INSAT-3DS meteorological satellite onboard a Geosynchronous Launch Vehicle F14 (GSLV-F14), from Satish Dhawan Space Centre in Sriharikota.
— ANI (@ANI) February 17, 2024
(Source: ISRO) pic.twitter.com/abjPVJWkxh
ఈ ప్రయోగం విజయంవంతం అవడంపై ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. అనుకున్న విధంగానే కక్ష్యలోకి దూసుకెళ్లినట్టు ప్రకటించారు.
"GSLV-F14 ఇన్సాట్ ప్రయోగం విజయవంతం అయిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మేం అనుకున్న విధంగానే నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్ ప్రవేశించింది. ఈ ప్రక్రియ అంతా చాలా సాఫీగా సాగిపోయింది. ఈ మిషన్‌లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు"
- ఎస్ సోమనాథ్, ఇస్రో ఛైర్మన్
#WATCH | Andhra Pradesh: On the launch of ISRO's INSAT-3DS meteorological satellite onboard a Geosynchronous Launch Vehicle F14 (GSLV-F14), ISRO Chairman S Somanath says "I am very happy to announce the successful accomplishment of the mission GSLV-F14 INSAT-3DS. The spacecraft… pic.twitter.com/McbU9AJAuH
— ANI (@ANI) February 17, 2024
ఇస్రో చేపట్టిన రాకెట్ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14(GSLV F14) ద్వారా నింగిలోకి చేరనున్న 3డీఎస్ ఉపగ్రహం వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన ప్రయోగం. తద్వారా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అంచనా వేస్తారు. అంతేకాదు.. విపత్తు హెచ్చరిక వ్యవస్థలను(తుఫానులు, భూకంపాలు, పిడుగులు, సునామీలు) మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే కక్ష్యలో ఉన్న ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఈ 3డీఎస్ పనిచేయనుంది.
ఇవీ.. లాభాలు!
+ వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం.
+ విపత్తు హెచ్చరికలు నిముషాల వ్యవధిలోనే అందుబాటులోకి రావడం.
+ భూమి, సముద్ర ఉపరితలాలను నిరంతరాయంగా పరిశీలించడం.
+ వాతావరణంలోని వివిధ పరిస్థితుల ప్రొఫైల్‌లను అత్యంత వేగంగా అందించడం.
+ డేటా కలెక్షన్ ప్లాట్‌ఫారమ్ (DCP)