అన్వేషించండి

Gaza News: ఫ్యుయెల్ లేక మూతపడుతున్న హాస్పిటల్స్‌, గాజాలో యుద్ధ బాధితులకు నరకయాతన

Israel Hamas War: యుద్ధం కారణంగా రఫాలోని హాస్పిటల్స్‌లో ఫ్యుయెల్ నిండుకుంటోందని మెడికల్ ఆపరేషన్స్‌కి కష్టమవుతోందని WHO ఆందోళన వ్యక్తం చేసింది.

Israel Hamas War News: ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం (Israel Hamas War)  రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. ఈ దాడుల్లో గాయపడిన పౌరులకు చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రత్యేకంగా మెడికల్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. కొన్ని హాస్పిటల్స్‌లో ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ అందిస్తోంది. అయితే...రఫాపై ఇజ్రాయేల్ దాడులు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడి హాస్పిటల్స్‌లో మెడికల్ ఆపరేషన్స్‌కి ఆటంకం కలిగే ప్రమాదముందని చెబుతోంది. కేవలం మూడు రోజులకు సరిపడ ఫ్యుయెల్ మాత్రమే అందుబాటులో ఉందని ఆ తరవాత హాస్పిటల్స్‌ని మూసేయక తప్పదని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఓ హాస్పిటల్‌ని మూసేసినట్టు వెల్లడించింది. ఈజిప్ట్‌తో సరిహద్దు పంచుకుంటున్న రఫా ప్రాంతం (Rafah) ప్రస్తుతం నిఘా నీడలో ఉంది. ఇజ్రాయేల్ మిలిటరీ పూర్తిగా ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. మానవతా సాయం అందించేందుకూ వీల్లేకుండా పోయింది. దీనిపైనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. హాస్పిటల్ విద్యుత్‌ ఉండాలన్నా, ఇతరత్రా పరికరాలు పని చేయాలన్నా ఫ్యుయెల్ అవసరం అని తేల్చి చెబుతోంది. కానీ...ప్రస్తుతానికి అక్కడికి ఏమీ తీసుకెళ్లే పరిస్థితి లేదు. అటు ఐక్యరాజ్యసమితి కూడా నార్త్‌ గాజాలోని స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్ స్పందించింది. మానవతా సాయం అందించేందుకు తాము అడ్డు కాదని స్పష్టం చేసింది. Kerem Shalom క్రాసింగ్‌ని తెరుస్తున్నట్టు వెల్లడించింది. 

వేలాది మంది బలి..

అయితే..గాజాలో మాత్రం ఐక్యరాజ్యసమితి ఎలాంటి సాయం అందించేందుకు వీల్లేకుండా పోయింది. పాలస్తీనా వైపు ఎవరూ ఈ సాయాన్ని తీసుకోడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేసింది. ఈ యుద్ధం కారణంగా గాజాలో 80% మేర ప్రాంతం అల్లకల్లోలమైపోయింది. 23 లక్షల పౌరులు నిరాశ్రయులయ్యారు. అపార్ట్‌మెంట్‌లు, బిల్డింగ్‌లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. మసీదులు, హాస్పిటల్స్, స్కూల్స్ పరిస్థితీ ఇంతే. అధికారిక లెక్కల ప్రకారం...ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ గాజాలో 34,500 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడులు చేశారు. ఈ దాడులకు వెంటనే స్పందించి ఇజ్రాయేల్‌ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. అప్పుడు మొదలైన ఈ యుద్ధం కొనసాగుతోంది. హమాస్ చేసిన తొలి దాడిలోనే 1,200 మంది ఇజ్రాయేల్ పౌరులు మృతి చెందారు. ఆ తరవాత ఇజ్రాయేల్ భీకరదాడులు మొదలు పెట్టింది. రెండు వైపులా భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. హమాస్ ఉగ్రవాదుల బందీలో దాదాపు 100 మంది శరణార్థులు ఉన్నారని, వాళ్లని విడిచి పెట్టేంత వరకూ ఊరుకునేదేలేదని ఇజ్రాయేల్ మిలిటరీ తేల్చి చెబుతోంది. రెండు వైపులా శరణార్థులను అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విడతల వారీగా వాళ్లను అప్పగిస్తున్నారు. అయితే...ఇజ్రాయేల్‌పై దాడులు ఆపకపోతే రఫాపై విరుచుకుపడతామని మిలిటరీ హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ అన్ని సన్నాహాలు చేసింది. కాల్పుల ఉపసహంరణకు అంగీకరిస్తే దాడులు చేయడం ఆపేస్తామని హమాస్‌కి స్పష్టం చేసింది. 

 Also Read: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిపై నిఘా, ఆఫీస్‌కి రాని ఉద్యోగులకు రెడ్‌ఫ్లాగ్ - డెల్‌ కంపెనీ కొత్త రూల్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget