Pahalgam Retaliation: పాక్ పై ప్రతీకారానికి ఇంత సమయం… ఇదే మొదటిసారి… అదును చూసి కొడతారా..?
Pahalgam Retaliation: పెహల్గామ్‌లో పాక్ ముష్కరులు విరుచుకుపడి అప్పుడే రెండు వారాలు గడచిపోయింది. ఈ స్థాయి తీవ్రవాద దాడుల తర్వాత భారత్ నుంచి ప్రతి ఘటనకు ఇంత సమయం తీసుకోవడం ఇదే మొదటి సారి.

Pahalgam Retaliation: చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్న కశ్మీరంలో ఉగ్రమూకలు రక్తపాతం సృష్టించి అప్పుడే రెండు వారాలు కావొస్తోంది. మొదటి రెండు మూడు రోజుల తర్వాత దీనిపై ఎలాంటి హడావిడీ లేదు. చాలా స్థబ్దుగా నిశ్బబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దం భయంకర విస్ఫోటనంగా మారుతుందా..? భారత్ అదును చూసి చావు దెబ్బ తీయనుందా..?
నివురు గప్పిన నిప్పులా..
ఏప్రిల్ 22వ తేదీన Pahalgamలో 26 మంది అమాయక పర్యాటకులను హతమార్చారు. ఆ రోజు తర్వాత పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఆంక్షలు, సింధూ నది ఒప్పందాన్ని నిలుపుదల చేయడం, ఇవన్నీ చేశారు కానీ.. మిలటరీ యాక్షన్ మాత్రం తీసుకోలేదు. ఉగ్రశిబిరాలు నిర్వహిస్తున్న మూకలపై బలమైన ప్రతీకార దాడి జరగాలని రాజకీయ పక్షాల నుంచి సామాన్యజనం వరకూ కోరుకుంటున్నారు. ఇంతకు ముందు ఉగ్రవాద దాడులపై భారత్ తీసుకున్న ప్రతీకార సర్జికల్ స్ట్రైక్స్ ను దృష్టిలో ఉంచుకుని అలాంటిది ఏదైనా జరుగుతుందని లేదా అంతకుమించి ఉండొచ్చని దేశవ్యాప్తంగా ఊహాగానాలు అయితే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రధాని, రక్షణమంత్రి .. కచ్చితంగా బదులు తీర్చుకుంటామని.. ఆ దెబ్బ చాలా గట్టిగా ఉంటుందని అయితే చెప్పారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ ఉగ్రవాద ఘటనపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని వారే తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కొన్నాళ్లుగా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.

ఇంత సమయం ఎన్నడూ లేదు..
భారత్ -పాకిస్థాన్ రెండు దేశాలుగా ఏర్పడ్డ తర్వాత రెండింటి మధ్య మూడు యుద్ధాలు, చాలా సందర్భాల్లో యుద్ధం లాంటి పరిస్థితులూ వచ్చాయి. పాకిస్థాన్ నుంచి ఎప్పుడు దుందుడుకు చర్యలు ఉన్నా.. భారత్ ఎప్పుడూ వెంటనే బదులిచ్చింది. కొన్నిసార్లు అయితే కనీసం ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు. కానీ ఈ 75 ఏళ్లలో మొదటి సారి భారత్ ఇంత సమయం తీసుకుంటోంది. అసలు ఇప్పటి వరకూ ఏం జరిగిందో చూస్తే..
1947
- అక్టోబర్ 22న కశ్మీర్‌ను సీజ్ చేయాలని పాకిస్థాన్ పిలుపునిచ్చింది. దీనినే మొదటి కశ్మీర్ యుద్ధానికి ప్రారంభం అనుకోవచ్చు. అక్టోబర్ 26న జమ్మూ కశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో విలీనం అయింది. అక్టోబర్ 27న సైనిక చర్య మొదలైంది. గురుగావ్‌లో సిక్కు బెటాలియన్ రాష్ట్రాన్ని కాపాడటానికి శ్రీనగర్ చేరుకుంది.
రియాక్షన్ టైమ్ కేవలం 5రోజులు
1965
- సెప్టెంబర్ 1, 1965న పాకిస్థాన్ Akhnoor సెక్టార్‌లో దాడులు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 6న ఇండియన్ ఆర్మీ లాహోర్ సెక్టార్‌పై ఆకస్మిక దాడి చేసింది. భారతీయ సేనలు చాలా చోట్ల సరిహద్దును దాటి పాక్ సైన్యాన్ని లాహోర్ సెక్టర్‌లో తరిమి కొట్టాయి. భారత్ నుంచి ఈ ఊహించని ప్రతిస్పందన పాక్‌ను షాక్‌కు గురి చేసింది.
రియాక్షన్ టైమ్ కేవలం 5 రోజులు
1971
- డిసెంబర్ ౩, 1971లో పాకిస్థాన్ ఎలాంటి కవ్వింపులు కూడా లేకుండా పశ్చిమ సెక్టార్‌లో నేరుగా వైమానిక దాడులు జరిపింది. అది అధికారిక యుద్ధమే. అదే రోజు రాత్రి The Indian Air Force (IAF) దీటుగా వైమానిక దాడులతో బదులిచ్చింది.
రియాక్షన్ టైమ్ – అదే రోజు
1999
- May 3, 1999న కర్గిల్ కొండలపై ఊహించని కదలికలు ఉన్నాయని స్థానిక పశువుల కాపర్లు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున పాకిస్థాన్ ఆర్మీ, మిలిటెంట్లు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చారని సైనిక దళాలు గుర్తించాయి. మే 10వతేదీన ‘ఆపరేషన్ విజయ్’ ను డిక్లేర్ చేశారు.
భారత్ రియాక్షన్ టైమ్ -7 రోజులు
2016 - Uri Attack
- September 18, 2016 న యురీ Uri సైనిక క్యాంప్‌పై అటాక్ చేసిన 19మంది ఇండియన్ ఆర్మీ సభ్యులను హతమార్చారు. సెప్టెంబర్ 28-29 రాత్రి POKలోని ఉగ్రశిబిరాలపై సర్జికల్ దాడులు జరిగాయి.
భారత్ రియాక్షన్ టైమ్ -10రోజులు
2019 – Pulwama attack and Balakot strike
ఫిభ్రవరి 14, 2019న - 40 మంది CRPF సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని Jaish-e-Mohammed (JeM) ఆత్మాహుతి దళ సభ్యులు శ్రీనగర్- జమ్మూ హైవేపై పేల్చేశారు. February 26, 2019న పాకిస్థాన్‌పై ఎయిర్ స్ట్రైక్ జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జైషే మహమ్మద్‌కు చెందిన అతిపెద్ద టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్‌ను పాకిస్థాన్‌లోని బాలకోట్‌లో నేలమట్టం చేసింది.
భారత్ రియాక్షన్ టైమ్ -12 రోజులు
పాకిస్థాన్ ఆర్థిక దిగ్బంధనం
ఇప్పటి వరకూ పహల్గామ్‌పై ప్రతీకార దాడి చేయలేదన్నదే కానీ.. భారత్ మాత్రం అనేక రూపాల్లో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచుతూనే ఉంది. ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే దేశాలకు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని నిలిపేసేలా భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పాకిస్థాన్‌ను మళ్లీ Financial Action Task Force (FATF) గ్రే లిస్టులో చేర్చేలా ప్రయత్నాలు చేస్తోంది. FATF అనేది టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ దేశాలను మానిటర్ చేస్తూ ఉంటుంది. జూన్ 2018, నుంచి అక్టోబర్ 2022లో ఆ జాబితా నుంచి బయటకొచ్చే వరకూ పాకిస్థాన్ పై నిఘా ఎక్కువుగా ఉంది. ఆ మధ్య కాలంలో అది దాదాపు 84 వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ సాయాన్ని కోల్పోయింది.
IMFలో అభ్యంతరం
ఇంతే కాకుండా IMF లోన్లపై కూడా భారత్ అభ్యంతరం తెలుపుతోంది. తీవ్ర పేదరికంతో ఉన్న పాకిస్థాన్‌ను ఆదుకోవడం కోసం IMF జూలై 2024 లో దాదాపు 60వేల కోట్ల సాయాన్ని ప్రకటించి నిధులు అందిస్తోంది. అయితే ఈ నిధులను పాకిస్థాన్ దారి మళ్లించి తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అంతే కాకుండా తాజాగా మరో 10వేల కోట్ల నిధులను ఇచ్చేందుకు ఈ నెల 9న జరిగే IMF బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. అయితే భారత్ అభ్యంతరాలతో ఈ తాజా లోన్ తో పాటు.. మొదట మంజూరు చేసిన 60వేల కోట్ల రూపాయలను కూడా IMF మదింపు చేయనుంది.
పాక్ నయవంచన-నమ్మక ద్రోహం
పహల్గామ్ దాడి తర్వాత సింధూ నది ఒప్పందాన్ని నిలుపుదల చేయడం సహా.. భారత్ తీసుకున్న అనేక చర్యలపై పాకిస్థాన్ కూడా స్పందించింది. తామూ సిమ్లా అగ్రిమెంట్‌ను రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. అసలు సిమ్లా అగ్రిమెంట్‌ను వాళ్లు గుర్తించిందే లేదు. 1971 యుద్ధంలో ఘోర ఓటమి తర్వాత పాకిస్థాన్ భారత్‌తో ఈ ఒప్పందం చేసుకుంది. జూలై 2, 1972న భారత్ ప్రధాని ఇందిరా గాంధీ, పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం కశ్మీర్ సమస్యను రెండు దేశాలూ .. ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి. ఏ ఇతర అంతర్జాతీయ వేదికలపై దీనిని ప్రస్తావించకూడదు. కానీ పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని మీరు యునైటెడ్ నేషన్స్, SAARC వేదికలపై దీనిని ప్రస్తావించింది. Line of Control -LoC ని గుర్తించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. కానీ పాకిస్థాన్ LoCని మీరి చాలా సార్లు భారత్ భూ భాగంలోకి వచ్చింది.





















