ఇండిగో ఫ్లైట్‌లో కుషన్ లెస్ సీట్, అవాక్కైన మహిళా ప్యాసింజర్ - ఫొటో వైరల్
Indigo Flight: ఇండిగో ఫ్లైట్‌లో కుషన్ లెస్ సీట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Indigo Flight Cushionless Seat: బెంగళూరు నుంచి భోపాల్‌కి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ మహిళా ప్యాసింజర్‌కి వింత అనుభవం ఎదురైంది. తాను బుక్ చేసుకున్న సీట్‌పై కుషన్స్ కనిపించలేదు. వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "Cushionless Seats" అంటూ పోస్ట్ పెట్టింది. సేఫ్‌గా ల్యాండ్ అవుతాను అనుకుంటున్నా అంటూ సెటైర్ వేసింది. ఈ పోస్ట్‌కి ఇండిగో అఫీషియల్ అకౌంట్‌ని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెట్టారు.
Beautiful @IndiGo6E — I do hope I land safely! :)
— Yavanika Raj Shah (@yavanika_shah) March 6, 2024
This is your flight from Bengaluru to Bhopal 6E 6465. pic.twitter.com/DcPJTq3zka
ఈ పోస్ట్ వైరల్ అవడం వల్ల వెంటనే ఇండిగో స్పందించింది. క్లీనింగ్ ప్రాసెస్‌లో భాగంగానే ఆ కుషన్స్‌ని తొలగించినట్టు వివరణ ఇచ్చింది. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు ఆ కుషన్స్‌ని తీసినట్టు వెల్లడించింది. ఇది రోజూ జరిగే ప్రక్రియే అని స్పష్టం చేసింది. తమ సిబ్బంది వెంటనే స్పందించి వాళ్లకి సహకరించినట్టు వివరించింది. ఇప్పటికే ఈ పోస్ట్‌కి 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది కామెంట్స్ పెట్టారు. గతంలోనూ ఇలా కుషన్ లెస్ సీట్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవన్నీ ఇండిగో ఫ్లైట్స్‌లోనివే.
"ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు థాంక్స్. కేవలం క్లీనింగ్ కోసమే ఆ కుషన్స్‌ని తొలగించాల్సి వచ్చింది. ప్యాసింజర్స్‌కి ఈ విషయాన్ని మా సిబ్బంది చెప్పింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలన్నదే మా లక్ష్యం"
- ఇండిగో యాజమాన్యం
Ma'am, thank you for speaking with us. The seat cushions were replaced prior to the flight for cleaning purposes. Our cabin crew promptly informed the customers who were allotted these seats. This is a standard practice for cleaning during transit as and when required. (1/2)
— IndiGo (@IndiGo6E) March 6, 2024





















