షిఫ్ట్ టైమింగ్స్ పట్టించుకోకుండా పని చేస్తున్న ఇండియన్స్, వర్కింగ్ అవర్స్ ఇక్కడే ఎక్కువట - రిపోర్ట్
Week Work Hours: ప్రపంచంలోనే ఎక్కువ గంటలు పని చేసేది భారతీయులే అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
Week Work Hours:
వర్కింగ్ అవర్స్‌పై ILO రిపోర్ట్
వర్కింగ్ అవర్స్‌పై (Week Work Hours) ఇన్‌ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. పని గంటలపై ఒక్కొక్కరూ ఒక్కో వాదన వినిపిస్తున్నారు. వారానికి 70 గంటలు పని చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ...ఈ వ్యాఖ్యల్ని అందరూ సమర్థించడం లేదు. ఈ డిబేట్ జరుగుతున్న క్రమంలోనే International Labour Organization (ILO) ఓ ఆసక్తికర రిపోర్ట్‌ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కష్టపడి చేసే వాళ్లలో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పింది. 2023 లెక్కల ప్రకారం..అంతర్జాతీయంగా భారతీయులు వారానికి 47.7 గంటలు పని చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. యావరేజ్ వర్క్‌వీక్ విషయంలో భారత్ ముందంజలో ఉందని తెలిపింది. ఈ విషయంలో ఖతార్, కాంగో, లెసోతో, భూటాన్, గాంబియా, యూఏఈ కూడా ముందంజలోనే ఉన్నాయి. కేవలం వర్కింగ్ అవర్స్‌పైనే రీసెర్చ్ చేసి ఈ రిపోర్ట్‌ని విడుదల చేసింది ILO.ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో నారాయణ మూర్తి భారత్ వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్ ఈ విషయంలో వెనకంజలో ఉందని అన్నారు. భారత్‌లోని యువత వారానికి 70 గంటలు పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత జర్మనీ, జపాన్‌లో ఇదే రూల్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆ స్ట్రాటెజీతో ఆర్థిక వ్యవస్థ చాలా త్వరగా కోలుకుందని అన్నారు.
ఫ్రాన్స్‌లో చాలా తక్కువ..
నిజానికి వర్కింగ్ అవర్స్ గురించి చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ Bombay Shaving Company సీఈవో శంతను దేశ్‌పాండే రోజుకి కనీసం 18 గంటలు పని చేయాలని అన్నారు. అయితే...లింక్డిన్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. వర్కింగ్ అవర్స్ (Working Hours) అనేది దేశ GDPపై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎక్కువ పని గంటలున్న దేశ GDP తక్కువగానే ఉంది. వర్కింగ్ అవర్స్ తక్కువగా ఉన్న దేశంలో GDP ఎక్కువగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వీక్‌లీ వర్గింగ్ అవర్స్ ఉన్న దేశాల్లో జీడీపీ తక్కువగా ఉందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. అన్నింటి కన్నా తక్కువ వర్కింగ్ అవర్స్ ఉన్నది ఫ్రాన్స్‌లోనే (France Working Hours). ఇక్కడ వారానికి 30.1 గంటలు మాత్రమే పని చేస్తారు. ఇక్కడే GDP కూడా ఎక్కువ. పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న వర్కింగ్ అవర్స్‌ని భారత్ ఫాలో అవడం మానేయాలన్నది కొందరు నిపుణులు ఇస్తున్న సలహా. వారానికి 35 గంటలు పని చేయాలన్న రూల్‌ని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సగటున వీక్‌లీ వర్గింగ్ అవర్స్ 39 గంటలుగా ఉంది. చాలా చోట్ల ఇది అమలు చేస్తున్నారు. ఎక్కువ గంటలు పని చేయకూడదని చాలా స్ట్రిక్ట్‌గా చెబుతున్నాయి కంపెనీలు. వర్క్, లైఫ్‌లో ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పొద్దని స్పష్టం చేస్తున్నాయి.
Also Read: విపక్ష నేతల ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్రం సీరియస్, యాపిల్ అధికారులకు సమన్లు!