Viral News: అ గ్రామ మగాళ్లలో ఆర్యన్ జీన్స్ - ప్రెగ్నెన్సీ టూరిజానికి విదేశీ మహిళల క్యూ - ఎక్కడంటే ?
Indian Village: పుట్టబోయే బిడ్డలు అత్యంత సమర్థులుగా ఉండాలని చాలా మంది కోరుకంటారు. ఆర్యన్స్ జీన్స్ అయితే ఇలాంటి వారు కరెక్ట్ అని భావిస్తారు. అదే ఆ గ్రామ పురుషుల పంట పండించేలా చేస్తోంది.
Indian Village Where the Foreign Woman Come to Pregnant: భారత్ లో అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి లద్దాఖ్. అక్కడికి విదేశీ టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. కానీ లద్దాఖ్‌లో బ్రోక్పా అనే తెగకు చెందిన ప్రజలు ఐదు వేల మంది చాలా కొద్ది గ్రామాల్లో ఉంటారు. వీరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. ఎందుకంటే వీరి ఆర్యన్ల వారుసలని .. వీరి జీన్స్ తో పిల్లల్ని కంటే ఆర్యన్లంత బలంగా.. ఉంటారని నమ్ముతున్నారు.
తాము స్వచ్చమైన ఆర్యన్లమని చెప్పే బ్రోక్సా జాతి ప్రజలు
లద్దాఖ్‌లో సింధూ నది ఒడ్డున ఉండే బియామా, దాహ్, హానూ, దార్చిక్ లాంటి గ్రామాల్లో ఐదు వేల మంది బ్రోక్పా వర్గానికి చెందిన ప్రజలు ఉంటారు. వీరిని చిట్ట చివరి ‘స్వచ్ఛమైన ఆర్యులు’గా గుర్తిస్తున్నారు. ఈ బ్రోక్పా ప్రజల గురించి శోధించి..వీరి పురుషులతో గర్భం ధరించేందుకు చాలా మంది విదేశీ మహిళలలు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ‘ప్రెగ్నెన్సీ టూరిజం’ అనే పేరు కూడా వచ్చింది. ఈ బ్రోక్పా ప్రజలే స్వచ్ఛమైన ఆర్యులని .. వారితో సంపర్కం చేసి ‘స్వచ్ఛమైన ఆర్యుల’కు జన్మనిచ్చే ఉద్దేశంతో మహిళలు విదేశాల నుంచి వస్తుంటారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
Also Read: మారిపోతోంది.. అంతా మారిపోతోంది - ఆడోళ్లను, మగోళ్లను ఇక రోబోలే సుఖపెడతాయట !
విదేశీ మహిళలు వచ్చి గర్భం చేయించుకుని వెళ్తారని ప్రచారం
అయితే బోక్సా ప్రజలు మాత్రం ఇలాంటి విషయాలు మాట్లాడరు. ఆర్యన్లు ఎత్తుగా, పొడుగ్గా ఉంటారు. బ్రోక్సా వర్గంలో అందరూ అలాగే ఉంటారు. మిగతా లద్దాఖ్ వాసులతో పోలిస్తే బ్రోక్సా వర్గంప్రజల ముఖాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. వారి సంస్కృతి సంప్రదాయాలు కూడా భిన్నంగా ఉంటాయి. బ్రోక్పాలు ఏటా అక్టోబర్‌లో బొనోనా అనే పంట కోతల వేడుకులను నిర్వహిస్తారు. ఈ వేడుకలను బ్రోక్పాల సముదాయాలు స్థిరపడిన ఒక్కో గ్రామంలో ఒక్కో ఏడాది నిర్వహిస్తారు.
తమకు చెడ్డపేరు వస్తుందని ఒక్క మాట కూడా మాట్లాడని బ్రోక్సా ప్రజలు
ఈ ఆర్యుల వారసుల గురించి ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరుగుతూండటంతో.. విదేశీ మహిళల రాక ఎక్కవ అయిందన్న ప్రచారం జరుగుతోంది. తమ పురుషులతో విదేశీ మహిళలు సంబోగంలో పాల్గొని గర్భం ధరించిన తర్వాత వారు వెళ్లిపోయిన బ్రోక్సా మహిళలు అభ్యంతర పెట్టడం లేదు. ఆర్యుల సంతానం పెరగాలని వారు కోరుకుంటారన్న ప్రచారం ఉంది. వీరు ఎంత ఐక్యంగా ఉంటారంటే.. ఇలాంటి విషయాపై ఎక్కడా.. ఎప్పుడూ మాట్లాడరు. యూట్యూబ్ చానళ్లుకు చెందిన వాళ్లు టూరిస్టులుగా వెళ్లి మాట్లాడినా అసలు విషయాలు మాత్రం మాట్లాడరు. అందుకే ఈ విషయంపై ఎప్పుడూ అధికార సమాచారం బయటకు రాలేదు.