World Day Of War Orphans 2024: అనాథ పిల్లలను ఎలా దత్తత తీసుకోవాలి ? ఇండియాలో ఉన్న రూల్స్ ఏంటి ?
World Day of War Orphans 2024 : జనవరి 6...ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం. యుద్ధంతో అనాథలైన పిల్లల గురించి అవగాహన పెంచడం కోసం...యుద్ధ అనాథల దినోత్సవం నిర్వహిస్తారు.
దత్తత తీసుకోవాలంటే ఈ సర్టిఫికెట్లు సమర్పించాల్సిందే
వార్ కారణంగా ఇండియాలో అనాథుల అయ్యే వాళ్లు తక్కువే అయినా మిగతా కారణాలతో అనాథలు అవుతున్నారు. అలాంటి వారిని దత్తత తీసుకునేందుకు చాలా రూల్స్ పాటించారు. ఇండియాలో అనాథలను దత్తత తీసుకోవాలనుకునే వారు...స్త్రీ- శిశు సంక్షేమశాఖ ప్రభుత్వ వెబ్‌సైట్లో లాగిన్ అవ్వాలి. పాన్‌కార్డు ద్వారా దత్తతకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మ్యారేజ్ సర్టిఫికెట్, భార్యాభర్తల బర్త్ సర్టిఫికెట్లు, హెల్త్ సర్టిఫికెట్లు, పాన్ కార్డు, రెసిడెన్స్ ఫ్రూఫ్, ఇన్ కం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. కనీసం ఇద్దరు వ్యక్తుల నుంచి సిఫారసు లేఖలు, వారి ఐడీ కార్డులను సమర్పించాలి. భార్యభర్తలిద్దరి పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇద్దరు కలిసి దిగిన పెళ్లి నాటి ఫోటోల దరఖాస్తుతో పాటు అందజేయాలి. అప్లికేషన్ తో పాటు 6వేల రూపాయల డీడీ, 40 వేల రూపాయలను దత్తత తీసుకునే అందజేయాలి.
బాలిక, బాలుడికి వేర్వేరు నిబంధనలు
మనదేశంలో అనాథ పిల్లలను దత్తత తీసుకోవడానికి అనేక రూల్స్ ఉన్నాయి. బాలుడిని దత్తత కంటే బాలికను దత్తత తీసుకునేందుకు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఓ రహస్య ఒప్పందం ప్రకారం పిల్లలను కొందరు దత్తత తీసుకుంటారు. అయితే ఇది చట్టప్రకారం నేరం. కొన్నాళ్లుగా అనాథపిల్లల దత్తతను ప్రోత్సాహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అనాథ పిల్లలను ఎక్కడ పడితే అక్కడ దత్తత తీసుకోవడం కుదరదు. అనాథాశ్రమ నిర్వహకులు మాత్రమే దత్తత ఇచ్చేందుకు చట్టబద్ధంగా అర్హులు. అంతేకాకుండా చట్టప్రకారం నడుస్తున్న అనాథాశ్రామాల నుంచి మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలి. అనాథాశ్రమం నుంచి పిల్లలను దత్తత తీసుకునేటప్పుడు కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. 15 ఏళ్లు నిండని పిల్లలను మాత్రమే దత్తత తీసుకోవడానికి వీలుంటుంది. బాలుడిని దత్తత తీసుకోవాలంటే, ఆ దంపతులకు మగ పిల్లలు ఉండకూడదు. పిల్లలు లేని దంపతులు మాత్రమే దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. బాలికను దత్తత చేసుకోవాలంటే, వారికి కుమార్తెలు ఉండకూడదు. దత్తత చేసుకునే బాలిక వయసు కంటే, దత్తత స్వీకరించాలనుకునే తండ్రి వయసు కనీసం 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి.
భార్య అనుమతి కచ్చితంగా ఉండాల్సిందే
పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొన్ని నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికెట్ పొందాలన్నా, స్కూల్లో చేర్పించాలన్నా చట్టప్రకారం దత్తతను నమోదు చేయాల్సిందే. నోటి మాటగా చేసుకునే దత్తత వల్ల భవిష్యత్తులో అనేక చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బాలికను దత్తత తీసుకునేటప్పుడు ఉండే నియమాలు, బాలుడిని దత్తత తీసుకునే ముందు పాటించాల్సిన నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా మేజర్లయిన దంపతులే పిల్లలను దత్తత చేసుకునేందుకు అర్హులు. భార్య చనిపోయిన వ్యక్తి లేదా బ్రహ్మచారులు దత్తత తీసుకోవాలనుకుంటే…అతని మానసిక స్థితి సరిగా ఉందనే సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒంటరి మహిళలైతే ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. పిల్లల దత్తతకు భార్య అనుమతి తప్పనిసరి. ఒక వ్యక్తికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉంటే వారందరి సమ్మతించాల్సి ఉంటుంది.