News
News
X

 Viral News: 42 లీటర్ల చనుబాలు దానం చేసిన అమ్మ, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం!

 Viral News: అమృతం స్వచ్ఛంధ సంస్థకు 42 లీటర్ల తల్లిపాలు అందించి ఓ తల్లి రికార్డు సృష్టించింది.

FOLLOW US: 

 Viral News: తల్లి పాలు శిశువుకు అత్యంత శ్రేయస్కరం అంటారు పెద్దలు. శిశువుకు జన్మనిచ్చిక కొద్ది గంటలకే తల్లి శిశువుకు పాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. శిశువుకు పోత పాలు కంటే తల్లి పాలు వల్ల కావాల్సిన పోషకాలన్ని అందుతాయని వైద్యులు చెబుతారు. శిశువులు పుట్టినప్పటి‌ నుంచి రెండేళ్ల పాటు ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. కొన్ని అనారోగ్యాల కారణంగా కొంత మంది తల్లులు తమ శిశువులకు పాలు అందించలేక పోతున్నారు. దీంతో ఆ శిశువులు బలహీనంగా ఉండడంతో శిశువులకు అనేక చికిత్సలు అందించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం అనేక ఆరోగ్య సమస్యలతో దాదాపుగా 40 నుంచి 50 శాతం మంది తల్లులు శిశువులకు పాలు అందించలేక పౌడర్ పాలు పట్టిస్తున్నారు. తల్లి పాలు లేని శిశువులకు ఓ సంస్ధ వరంగా మారితే, ఏకంగా ఆ సంస్ధకు ఏడాదిలో దాదాపు 42 లీటర్ల తల్లి పాలు అందించి‌ మహిళా స్వరూపిణిగా మారింది. తల్లి పాలు లేని ఎంతో‌ మంది శిశువులకు ఆ మహిళ అమ్మగా మరింది.

30 మందికి పైగా తల్లులు పాల దానం..

తల్లి పాలు లేని నవజాతి శిశువులను ఆదుకునేందుకు రూప సెల్వ నాయకి అనే మహిళా అమృతం అనే స్వచ్చంధ సంస్థను కొన్నేళ్ల క్రితం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 50 మంది మహిళలు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 30 మందికిపైగా తల్లులు పాలను దానం ఇస్తుండగా, ఆ పాలను అనాథలు లేదా పాలు ఇవ్వలేని బాలింతల శిశువులకు రాష్ట్ర చైల్డ్ హెల్త్ శాఖ ద్వారా అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కేవలం 70 బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు ఉండగా, అందులో ఒక్క తమిళనాడులోనే 45 ఉన్నాయి. మొత్తం 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ కు చెందిన మహేశ్వరన్, సింధు మౌనిక దంపతులకు 18 నెలల కుమార్తె ఉంది. ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా అమృతం స్వచ్చంధ సంస్థ ఉందని తెలుసుకున్న సింధు మౌనిక తన పాలను తల్లి పాలు లేని శిశువులకు ఇవ్వాలని నిర్ణయం‌ తీసుకున్నారు.

News Reels

ఇంటికే వచ్చి తీసుకెళ్లే సదుపాయం..

ఈ సంస్ధపై అన్ని వివరాలు తెలుకుని రూప సెల్వనాయకి తల్లి పాలను దానం చేయాలని భావించారు. భర్త మహేశ్వరన్ చొరవతో సింధు మౌనిక గతేడాది జులై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 42 లీటర్ల పాలను అమృతం స్వచ్చంధ సంస్థకు దానం చేసింది. ఆ పాలను ఇంటి వద్దకే వచ్చి సంస్థ ఎన్జీఓలు సేకరించుకొనే వాళ్ళు. ఇలా సేకరించిన పాలను ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న చిన్నారులకు అందించారు. పాలను దానం చేసిన విషయం తెలుసుకున్న ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్ సంస్ధ ప్రతినిధులు సింధు మౌనికకు ఆ సంస్ధల్లో స్థానం కల్పించారు. సింధూ‌ మౌనిక సేవ గురించి తెలుసుకున్న తమిళనాడు ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Published at : 09 Nov 2022 05:11 PM (IST) Tags: Viral News Breast Milk Centre 42 Litres Breast Milk Woman Latest News Breast Milk Special Story

సంబంధిత కథనాలు

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

టాప్ స్టోరీస్

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

IND vs NZ 3rd ODI: భారత్- న్యూజిలాండ్ మూడో వన్డే- వర్షంతో నిలిచిన ఆట

IND vs NZ 3rd ODI: భారత్- న్యూజిలాండ్ మూడో వన్డే- వర్షంతో నిలిచిన ఆట

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్

Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్