Navya Yojana : పదో తరగతి పూర్తి చేసిన వారికి అదిరిపోయే కొత్త స్కీమ్; నవ్య యోజనకు ఎవరు అర్హులో తెలుసా?
Navya Yojana : NAVYA కింద కనీసం 10వ తరగతి పూర్తి చేసిన 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలకు వృత్తి శిక్షణ అందిస్తారు.

Navya Yojana : మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD), నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MSDE) సహకారంతో NAVYA పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ Viksit Bharat@2047 దార్శనికతలో భాగంగా కొత్త స్కీం స్టార్ట్ చేసింది. ఈ పథకం ద్వారా వృత్తి శిక్షణ అందిస్తారు. కౌమారదశలో ఉన్న బాలికలు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అంశంపై దృష్టి పెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
NAVYA అనే పథకం ద్వారా బాలికలకు వృత్తి శిక్షణ ద్వారా వారి ఆకాంక్షలు నెరవేర్చనున్నారు. ఈ పథకాన్ని 2025 జూన్ 24న ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో MSDE సహాయ మంత్రి జయంత్ చౌదరి, మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ అధికారికంగా ప్రారంభించారు.
నైపుణ్యం ఉన్న స్వావలంబన కలిగిన, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుంటోంది అందులో భాగమే NAVYA అని MWCD పేర్కొంది. మొదట ఈ ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుగా 19 రాష్ట్రాల్లోని 27 జిల్లాల్లో అమలు చేస్తారు. వీటిలో ఈశాన్య ప్రాంతంలోని కొన్ని జిల్లాలు ఉన్నాయి. సమగ్ర,ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నవ్య పథకం: అర్హత -ఇతర వివరాలు
నవ్య పథకం కింద శిక్షణ తీసుకోవాలంటే కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు బాలికలై ఉండాలి. అలాంటి వారికి వృత్తి శిక్షణ అందిస్తారు. ముఖ్యంగా సాంప్రదాయేతర ఉద్యోగా శిక్షణ, డ్రోన్ ఆపరేషన్, మొబైల్ ఫోన్ రిపేర్, సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్ వంటి నైపుణ్యాలు నేర్పిస్తారు. వేగంగా మారుతున్న ఉద్యోగ మార్కెట్‌లో ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
వాస్తవంగా ఉపాధి అందించే, పరిశ్రమలకు అవసరమయ్యే స్కిల్స్‌తో కూడిన ఏడు గంటల శిక్షణ మాడ్యూల్‌ను తయారు చేశారు. శిక్షణ తీసుకున్న వారికి ఉపాధి లభించి వారిలో విశ్వాసం పెంపొందించడమే లక్ష్యం. మహిళలకు అసాధారణంగా భావించిన కెరీర్‌లకు వారికి పైకి తీసుకురావాలని చూస్తోంది.
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY), ఇతర ప్రధాన నైపుణ్య అభివృద్ధి పథకాల విజయవంతమైన ఫ్రేమ్ నుంచి NAVYA తీసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ గురించి అధికారిక వివరాలు వెల్లడికాలేదు. పూర్తి వివరాలు త్వరలోనే MWCD లేదా MSDE వెబ్‌సైట్‌లు లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా నమోదు జరగవచ్చని అధికారులు సూచించారు.





















