News
News
X

Viral Letter: ఐ యామ్‌ వెరీ సారీ అంటూ ఐదు కిలోల బరువైన క్షమాపణ లేఖ- అక్క లెటర్‌ చూసి షాక్‌ అయిన తమ్ముడు

జనరల్‌గా చాలా మంది స్నేహితులు, సన్నిహితుల బర్త్‌డేలు మర్చిపోతుంటారు. వాళ్లు అలగడం తర్వాత మళ్లీ సర్దుకోవడం చూస్తుంటాం. కానీ కేరళలో జరిగింది మాత్రం వైరల్‌గా మారింది.

FOLLOW US: 

మే 24న జరిగిన ప్రపంచ బ్రదర్స్‌ డే సందర్భంగా తన తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయిందో ఓ అక్క. అంతే ఆ తమ్ముడు అలిగాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. వేరే ఫోన్ల నుంచి చేసిన మాట్లాడ లేదు. తమ్ముడిని ఇంప్రెస్‌ చేయడానికి ఆ అక్క చేసిన పని ఇప్పుడు వరల్డ్‌ రికార్డ్ సృష్టించబోతోంది. 

కేరళలోని తిరువనంతపురానికి 250 కిలోమీటర్ల దూరంలోని ఇడుక్కిలోని పీర్మేడులో తమ్ముడు కృష్ణప్రసాద్ ఉంటున్నారు. అతనికి ప్రపంచ సోదరుల దినోత్సవం (మే 24) నాడు శుభాకాంక్షలు చెప్పలేదని అలిగాడు. దీంతో అక్క కృష్ణ ప్రియ నిర్ణయం తీసుకుంది. క్షమించమని చెబుతూ ఓ లెటర్ రాసింది. లెటర్‌ అంటే అంతా ఆషామాషీగా రాయలేదు. 434 మీటర్ల పొడవు.. 5 కిలోల బరువు ఉన్న లెటర్‌ తమ్ముడికి పంపించింది. 

తన సోదరి తనను విష్ చేయలేదని, తన సందేశాలు, కాల్‌లను పట్టించుకోలేదని కృష్ణప్రసాద్ మనస్తాపం చెందాడు. అతను ఆ రోజు తనకు శుభాకాంక్షలు తెలిపిన ఇతరుల స్క్రీన్‌షాట్‌లను కూడా ఆమెకు పంపాడు కానీ ఏమైందో కానీ కృష్ణప్రియ వాటిని పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన అతడు ఆమెను వాట్సాప్‌లో కూడా బ్లాక్ చేశాడు. ఫోన్‌కి కూడా రియాక్ట్ కాలేదు. 

తన సోదరుడు కోపంగా ఉన్నాడని గ్రహించిన ప్రియ తన భావాలను లేఖపై రాయడం స్టార్ట్ చేసింది. "నేను ప్రతి సంవత్సరం మాదిరిగానే తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పడం పూర్తిగా మర్చిపోయాను. మా ఇద్దరి బాండింగ్‌ చాలా స్పెషల్. అయినా ఈసారి వేరే పనిలో బిజీగా ఉండటంతో శుభాకాంక్షల సంగతి మర్చిపోయాను. అది నా మనస్సును తర్వాత బాగా కలచి వేసింది. చాలా రోజుల తర్వాత నేను అతని మెసేజ్‌లు, స్క్రీన్ షాట్స్‌ చూసినప్పుడు చాలా బాధనిపించింది. అని ప్రియా అన్నారు. 

తమ్ముడు కృష్ణప్రసాద్‌ను కూల్ చేయడానికి... అతనితో మళ్లీ మునుపటిలా మాట్లాడటానికి లెటర్‌ ఓ మంచి మార్గంగా ప్రియ భావించారు. దీనికి ఏ4 సైజ్‌ పేపర్‌ ఒకటే సరిపోదని గ్రహించి డజన్లు కొద్ది పేపర్లు తెచ్చుకున్నారు. లెటర్ రాయడం ప్రారంభించారు. 

నాకు కొన్ని షీట్ల కంటే ఎక్కువ అవసరమని నేను గ్రహించినప్పుడు, నేను ఒక స్టేషనరీ దుకాణానికి వెళ్లి బేల్ కొన్నాను. మే 25 నుంచి 12 గంటల్లో లేఖను పూర్తి చేయాలని నేను 15 రోల్స్ కొని వాటిపై రాయడం ప్రారంభించాను. అని ఆమె  ప్రియ చెప్పారు. 

తమ్ముడు కృష్ణప్రసాద్‌కు అక్క కృష్ణ ప్రియ రాసిన ఉత్తరంలో ఏముంది అంటే...తన జీవితంలో అలాంటి సోదరుడు ఉన్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పడానికి పదాలు లేవు అని లేఖ ప్రారంభించారు. నిజంగా చాలా లక్కీ అని దేవుడు ఇచ్చి వరమే తమ్ముడని చెప్పారు. తాము కలిసి పంచుకున్న వివిధ మైలురాళ్లకు అతను జన్మించిన రోజు గురించి రాశారు. అతని మొదటి నడక, మొదటి భోజనం, పుట్టినరోజులను కలిసి ఎలా జరుపుకున్నారో వివరించారు. అతని ప్రస్తుత జీవితం వరకు ఆహారంలో అదే ఇష్టాలు, అయిష్టాలు ఉన్నాయి. ఇలా అనేక వందల పేజీలు రాసేశారు. 

తన తమ్ముడిని మొదటి సారి రోజును గుర్తుచేసుకున్నారు. తనకు ఏడేళ్లు ఉన్నప్పుడు తమ్ముడు తొలిసారిగా తనను చూసిన న్వవిన నవ్వు ఉంకా గుర్తు ఉందన్నారు ప్రియ. ఇతర పిల్లలతో పోలిస్తే కాస్త ఆలస్యంగా మాటలు నేర్చుకున్నాడని... దాని కోసం  ప్రతిరోజూ గుడికి వెళ్లేదాన్ని అని చెప్పారామె. "అతను మాట్లాడటం ప్రారంభించిన రోజు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను అతని తల్లి లాంటివాడిని, అతను నాకు కొడుకు అన్నారామె.

తమ తల్లిదండ్రులకు తమపై కొన్ని అంచనాలు పెట్టుకున్నారని వివరించారు ప్రియ. వాళ్ల అమ్మ ఒక సామాజిక కార్యకర్త, కాబట్టి  రూ. 100 సంపాదిస్తే... సొసైటీకి కనీసం రూ. 10. సహాయం చేయాలని నమ్ముతామన్నారు. అలా చేయమని లేఖలో సలహా ఇచ్చినట్టు తెలిపారు.  

ఇన్ని పేజీల లేఖ రాయం చాలా ఈజీగానే అయిపోయిందని... కానీ దాన్ని పంపించడానికి మాత్రం చాలా కష్టపడ్డానని చెప్పారు ప్రియ. ఒక్కో రోల్‌ 30 మీటర్లు ఉండే రోల్స్‌పై ఈ లెటర్‌ రాశానని... మొత్తం 434 మీటర్లు ఉండే దాన్ని అతికంచడానికి చాలా సమయం పెట్టిందన్నారు. చివరకు ఎంతో కష్టపడి రోల్స్‌ అన్నింటినీ అతికించి ప్యాక్ చేశానని చెప్పారు. 

"పోస్టాఫీసు వద్ద, దాని బరువు 5.27 కిలోలు, వారు నా కథ విన్నప్పుడు వారు సంతోషించారు," ప్రియ తెలిపారు. దీన్ని చూసిన తమ్ముడు ఆశ్చర్యపోయాడని తెలిపారు. 
"అతను నా గురించి తెలిసి చాలా గర్వపడుతున్నాడు. అతను ఇలాంటిది ఎప్పుడూ ఊహించలేదని చెప్పాడు. దీని గురించి తన స్నేహితులతో చెప్తూనే ఉన్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ”అని ప్రియ చెప్పారు. 

తన తమ్ముడికి క్షమాణలు కోరుతూ ప్రియ రాసిన పొడవైన బరువైన లేఖను గన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కోసం పంపించారు. వాళ్లు దాన్ని గుర్తించి నిర్దారించాల్సి ఉంది. 

Published at : 27 Jun 2022 04:59 PM (IST) Tags: kerala news Viral news Viral letter Apology Letter

సంబంధిత కథనాలు

Interstellar: ఇంటర్‌స్టెల్లార్ ఎందుకంత ప్రత్యేకం? ఇది లేకపోయుంటే భూమి ఉండేదే కాదా?

Interstellar: ఇంటర్‌స్టెల్లార్ ఎందుకంత ప్రత్యేకం? ఇది లేకపోయుంటే భూమి ఉండేదే కాదా?

Independence Day 2022 : భారత వాటర్ వారియర్స్ - వీరి స్ఫూర్తి లక్షల మంది దాహం తీరుస్తోంది !

Independence Day 2022 :  భారత వాటర్ వారియర్స్ - వీరి స్ఫూర్తి లక్షల మంది దాహం తీరుస్తోంది !

Independence Day 2022 : మనకు తెలియని మన స్వాతంత్య్ర యోధులు - ఎంత మంది తెలుగు వీరులో తెలుసా ?

Independence Day 2022 : మనకు తెలియని మన స్వాతంత్య్ర యోధులు - ఎంత మంది తెలుగు వీరులో తెలుసా ?

PM Modi Assets: భారీగా పెరిగిన మోదీ ఆస్తులు- కానీ సొంత వాహనం కూడా లేదు!

PM Modi Assets: భారీగా పెరిగిన మోదీ ఆస్తులు- కానీ సొంత వాహనం కూడా లేదు!

Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నెంబర్ వన్ - నేచర్ ఇండెక్స్ ర్యాంకులో టాప్

Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నెంబర్ వన్ - నేచర్ ఇండెక్స్ ర్యాంకులో టాప్

టాప్ స్టోరీస్

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Zoonotic Langya virus:  చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!