Train 1st AC Coach: ట్రైన్ ఫస్ట్ ఏసీ కోచ్‌లో లభించే సౌకర్యాలేంటీ? ఈసారి టికెట్ బుక్ చేసుకునే ముందు వీటిని మర్చిపోవద్దు!
Train 1st AC Coach: ప్రథమ AC కోచ్ సౌకర్యాలు: రైలులో చాలా సౌకర్యాలు ఉంటాయి. తెలుసుకుంటే, తదుపరి ప్రయాణానికి ఇప్పుడే బుక్ చేసుకుంటారు.

Train 1st AC Coach: దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో పూర్తి సురక్షితంగా సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులో వివిధ వ్యక్తుల కోసం వివిధ కోచ్‌లు ఉన్నాయి. చాలా ప్రీమియం ప్రయాణం చేయాలనుకునే వారి కోసం, రైలులో ఫస్ట్ AC కోచ్ కూడా ఉంది. ఈ ఫస్ట్ AC కోచ్‌లో ప్రయాణికులు టికెట్ ధరను మాత్రమే చూసి టికెట్‌ను బుక్ చేసుకోరు. కానీ ఈ కోచ్‌లో లభించే సౌకర్యాలకు ముచ్చట పడి బుక్ చేసుకుంటా ఉంటారు. ఫస్ట్ AC కోచ్‌లో ఆహారం నుంచి ప్రైవసీ వరకు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఇంకా ఏయే ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయో ఇక్కడ చూద్దాం.
ఆహారంలో లభించేవి ఇవే
ఫస్ట్ AC కోచ్‌లో ఆహార వ్యవస్థ చాలా బాగుంటుంది. పూర్తిగా ప్రీమియం క్వాలిటీ ఉన్న ఫుడ్‌ను ఇతర సౌకర్యాలను కల్పిస్తారు. అందుకే కాస్త రేటు ఎక్కువైనప్పటికీ ఫస్ట్ ఏసీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ ఫస్ట్‌్ ఏసీ కోచ్‌లో ప్రయాణించే వాళ్లకు ఉదయం టీతో పాటు అల్పాహారంలో బ్రెడ్-బటర్, కట్లెట్ లేదా ఉప్మా వంటివి లభిస్తాయి. మధ్యాహ్నం వెజ్ లేదా నాన్-వెజ్ మీల్స్ అందిస్తారు. ఇందులో రోటీ, అన్నం, కూరగాయలు, పప్పు, స్వీట్లు ఉంటాయి. సాయంత్రం స్నాక్స్‌లో సమోసా, పకోడా లేదా శాండ్‌విచ్‌తోపాటు టీని కూడా సప్లై చేస్తారు. డిన్నర్ కూడా పూర్తి ప్లేట్‌లో వడ్డిస్తారు. దీనితోపాటు, మీరు కావాలనుకున్నప్పుడు అటెండెంట్ నుంచి నీరు లేదా టీని కూడా పొందవచ్చు.
సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి
ఫస్ట్ క్లాస్ AC కోచ్ సీట్లు ఇతర కోచ్‌ల కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వాటి కుషనింగ్ మందంగా ఉంటుంది. మృదువుగా ఉంటుంది. దీనివల్ల కూర్చున్న వెంటనే ఇంటిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. క్యాబిన్‌లో రెండు రకాల సీట్లు ఉంటాయి. ఒకటి కూర్చోవడానికి, మరొకటి పడుకోవడానికి, ఇది విశాలంగా ఉంటుంది. చాలా మృదువుగా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణ సమయంలో మంచి నిద్ర కోసం, బెడ్‌షీట్‌లు, దిండ్లు, దుప్పట్లు కూడా అందిస్తారు. ప్రతి క్యాబిన్‌లో చిన్న అద్దం కూడా ఉంటుంది. మీరు ట్రైన్ దిగే టైంలో రెడీ అవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
గోప్యతకు శ్రద్ధ తీసుకుంటారు
రైలులో ప్రయాణించేటప్పుడు గోప్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనుకునే వాళ్లకు ఫస్ట్ AC కోచ్ ఉత్తమమైన ఎంపిక అవుతుంది. జనరల్, స్లీపర్ లేదా థర్డ్, సెకండ్ AC కోచ్‌లలో చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. కానీ ఫస్ట్ ACలో అలా కాదు. ఇక్కడ ప్రతి ప్రయాణికుడికి ఒక క్లోజ్ చేసి ఉన్న క్యాబిన్ కేటాయిస్తారు. దీనికి తలుపు ఉంటుంది.వాటికి కర్టెన్లు ఉంటాయి. డోర్ కు లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. కుటుంబం, పిల్లలు లేదా ప్రత్యేక వ్యక్తితో ప్రయాణిస్తుంటే, ఈ కోచ్ గోప్యతపరంగా ఉత్తమమైనదిగా పరిగణించవచ్చు. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటానికి, వాతావరణం కూడా పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు.





















