మమతా ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడు, అరెస్ట్ చేసిన పోలీసులు - ఆయుధాలు సీజ్
CM Mamata House: మమతా బెనర్జీ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
CM Mamata House:
పోలీసుల కళ్లుగప్పి..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఆయుధాలు ఉండటం అలజడి రేపింది. నిందితుడిని షేక్ నూర్ అలమ్గా గుర్తించారు. పోలీసులు అప్రమత్తమై వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. రకరకాల ఏజెన్సీలకు చెందిన ID కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాసేపటి వరకూ అక్కడ గందరగోళం నెలకొంది. నిందితుడి వద్ద ఉన్న తుపాకులు, కత్తులను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కోల్కత్తా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు.
"షేక్ నూర్ అలమ్ అనే ఓ వ్యక్తి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. కోల్కత్తా పోలీసులు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి తుపాకీ, కత్తులతో పాటు పలు ఏజెన్సీల పేరుతో ఉన్న ID కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టికర్ ఉన్న కార్లో వచ్చి ఇలా అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌కి విచారణ కోసం తీసుకెళ్లారు. పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడ విచారణ జరుపుతున్నారు"
- వినీత్ గోయల్,కోల్కత్తా పోలీస్ కమిషనర్
West Bengal | Kolkata Police Commissioner Vineet Goyal says, "Kolkata Police has intercepted one person, identified as Sheikh Noor Alam, near CM Mamata Banerjee’s residence while he was trying to enter the lane. One firearm, one knife & contraband substances found on him besides…
— ANI (@ANI) July 21, 2023
నితీష్‌కి తప్పిన ప్రమాదం..
ఇటీవలే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. తన నివాసానికి దగ్గర్లోనే మార్నింగ్ వాక్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఓ బైక్ ఆయనవైపు దూసుకొచ్చింది. అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ...సీఎం వెళ్తున్న మార్గంలోకి ఆ బైక్ ఎలా వచ్చిందన్నదే అంతు తేలకుండా ఉంది. బైక్ దూసుకొచ్చిన సమయంలో నితీష్ కుమార్ వెంటనే అలెర్ట్ అయ్యారు. పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూకారు. ఇంతలో అప్రమత్తమైన పోలీసులు ఆ బైక్‌పై వచ్చిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం భద్రతకు సంబంధించిన విషయం అవడం వల్ల ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయింది. ఇప్పటికే హై లెవెల్ మీటింగ్ కూడా జరిగింది. ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ఎలా అని అధికారులు గట్టిగానే వాదించినట్టు సమాచారం. SSG అధికారులను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వాకింగ్‌కి వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. అటు వైపు ఏ వాహనాన్నీ అనుమతించరు. అలాంటిది...ఓ బైక్ సీఎం దగ్గరి వరకూ వచ్చినా అప్పటి వరకూ ఎవరూ అలెర్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ పని చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ...అతనికి సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించలేదు.
Also Read: రాహుల్ పరువు నష్టం కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు, వివరణ ఇవ్వాలని ఆదేశాలు