By: Ram Manohar | Updated at : 21 Jul 2023 02:06 PM (IST)
రాహుల్ గాంధీ పరువు నష్టం దావా కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది.
Rahul Gandhi Defamation Case:
పది రోజుల్లోగా వివరణ కోరిన సుప్రీంకోర్టు..
రాహుల్ గాంధీ పరువు నష్టం దావా కేసులో మరో కీలక పరిణామం జరిగింది. రాహుల్‌ని దోషిగా తేల్చడంపై 10రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. రాహుల్‌పై పిటిషన్ వేసిన పూర్ణేష్ మోదీకి కూడా ఈ నోటీసులు పంపింది. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీం ధర్మాసనం. ఈ పిటిషన్‌ని ఒకే వైపు నుంచి కాకుండా రాహుల్ వైపు నుంచి కూడా పరిశీలించాలని జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఈ కేసు వల్ల 100 రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. శిక్ష పడిన కారణంగా చివరి పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరు కాలేకపోయారని...ఇప్పుడు కొనసాగుతున్న సమావేశాలకూ వెళ్లేందుకు అర్హత లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను ఆగస్టుకి వాయిదా వేసింది ధర్మాసనం. రాహుల్ గాంధీ తరపున అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు.
'Modi surname' remark | Supreme Court begins hearing of plea filed by Congress leader Rahul Gandhi challenging the Gujarat High Court order which declined to stay his conviction in the criminal defamation case in which he was sentenced to two years in jail by Surat court. pic.twitter.com/vr3RTwfhvv
— ANI (@ANI) July 21, 2023
ఇదీ జరిగింది..
పరువు నష్టం దావా కేసులో గుజరాత్ హైకోర్టు స్టే పిటిషన్‌ని కొట్టేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ బీజేపీ నేత సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అయితే...ఈ తీర్పుని సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో స్టే పిటిషన్ వేశారు రాహుల్. దీనిపై విచారణ చేపట్టిన గుజరాత్ కోర్టు..ఈ పిటిషన్‌ని తిరస్కరించింది. జులై 7న ఈ పిటిషన్‌ని కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ వారం రోజుల తరవాత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన క్రమంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది" అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. బీజేపీ తీవ్రంగా దీనిపై మండి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు...రాహుల్కు శిక్ష విధించింది.
Also Read: Bharat Jodo Yatra: సెప్టెంబర్లో భారత్ జోడో యాత్ర సెకండ్ ఫేజ్! లోక్సభ ఎన్నికల ముందు రాహుల్ స్ట్రాటెజీ
RRC SER: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ రాతపరీక్ష ఫైనల్ 'కీ' విడుదల
Food Poison in Train: ట్రైన్‌లో ఫుడ్ పాయిజన్, 90 మంది ప్రయాణికులకు తీవ్ర అస్వస్థత
గుళ్లో గంట కొడితే అది ధ్వని కాలుష్యం కాదా? అజాన్‌ని బ్యాన్ చేయాలన్న పిటిషన్‌పై కోర్టు అసహనం
Telangana Election Polling Updates: తెలంగాణలో ఓట్ల జాతర- 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
/body>