శ్రీనగర్‌లో సోనియా గాంధీ బోటు షికార్, రాహుల్ ప్రియాంక గాంధీలతో ప్రైవేట్ టూర్
Watch Video: శ్రీనగర్ పర్యటనకు వెళ్లిన సోనియా గాంధీ అక్కడి నిగీన్ సరస్సులో బోటు షికారు చేశారు.
Watch Video:
ప్రైవేట్ టూర్
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రైవేట్ టూర్‌లో భాగంగా శ్రీనగర్‌కి వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ అక్కడే పర్యటిస్తున్నారు. రాహుల్‌ని కలిసేందుకు వెళ్లిన ఆమె కాసేపు సేదతీరారు. నిగీన్ సరస్సులో బోటు షికారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ పర్యటనలోనే రాహుల్ గాంధీని కలవనున్నారు సోనియా.
"జమ్ముకశ్మీర్ రాహుల్ గాంధీకి ఇల్లులాంటిది. ఇక్కడి ప్రజలన్నా,ఈ ప్రాంతం అన్నా రాహుల్‌కి చాలా ఇష్టం. అందుకే...ఇక్కడ ప్రశాంతంగా రెండ్రోజుల పాటు గడపాలనుకుంటున్నారు. ఇది పొలిటికల్ విజిట్ కానే కాదు. ఇది పూర్తిగా పర్సనల్ విజిట్ మాత్రమే. లద్దాఖ్‌లో వారం రోజుల పాటు గడిపిన తరవాత రాహుల్ శ్రీనగర్‌కి వచ్చారు. "
- వికర్ రసూల్ వాణి, జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్
#WATCH | J&K: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives in Srinagar and takes a boat ride in Nigeen Lake
— ANI (@ANI) August 26, 2023
She will be meeting Congress MP Rahul Gandhi shortly pic.twitter.com/9jBEKG2ZB8
ప్రియాంక గాంధీ కూడా..
రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా శ్రీనగర్‌కి రానున్నారు. ఆమె భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. నిగీన్ లేక్‌లోని ఓ హౌజ్‌బోట్‌లోనే రాహుల్ గాంధీ స్టే చేస్తున్నారు. రైనవారిలోని ఓ హోటల్‌లో ఈ ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అవుతారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈ హోట్‌లతో గాంధీ కుటుంబానికి ఎన్నో జ్ఞాపకాలున్నాయట. రెండ్రోజులు ఇక్కడే ఉన్న తరవాత గుల్‌మార్గ్‌కి వెళ్లనున్నారు. దాదాపు వారం రోజుల పాటు లద్దాఖ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ..కార్గిల్‌లో ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీనగర్‌కి వెళ్లారు.
రాహుల్ బైక్‌రైడ్..
కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ లద్దాఖ్‌లో పర్యటించారు. అక్కడి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన..ఆ తరవాత రాజకీయాల్ని పక్కన పెట్టేశారు. ఓ ఎంపీగా కాకుండా ఓ సాధారణ పౌరుడిగా బైక్ రైడ్ చేయాలని అనుకున్నారు. అందుకే...లద్దాఖ్‌లోని పాంగాంగ్ లేక్ వరకూ బైక్‌పై వెళ్లారు. తన రైడ్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్. ఇందులో ఆయన చాలా స్టైలిష్‌గా కనిపించారు. ప్రో రైడర్ లుక్‌లో KTM 390 Adventure బైక్ నడిపారు. మరి కొందరు రైడర్స్ ఆయనను ఫాలో అయ్యారు. హెల్మెట్, గ్లోవ్స్, రైడింగ్ బూట్స్, జాకెట్‌తో రైడ్‌ని ఎంజాయ్ చేశారు. ఆగస్టు 20న రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ జయంతి. ఆయన జయంతిని పాంగాంగ్‌లో జరుపుకోవాలనేది రాహుల్ కల. అందులోనూ ఇది రాజీవ్ గాంధీకి చాలా ఇష్టమైన ప్రదేశమట. ఇదే విషయాన్ని రాహుల్ సోషల్ మీడియాలో చెప్పారు. రాజీవ్ గాంధీకి ఎంతో ఇష్టమైన పాంగాంగ్ లేక్ తీరంలోనే ఆయన ఫొటో పెట్టి పూల మాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాన్నతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ స్పెషల్ వీడియో కూడా పోస్ట్ చేశారు.
"నాన్న. నువ్వు కన్న కలలన్నీ మాకు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మీరు చెప్పిన మాటలే నాకు దారి చూపుతున్నాయి. ప్రతి పౌరుడి కలల్ని, కష్టాల్ని అర్థం చేసుకోగలుగుతున్నానంటే అది మీ వల్లే. భరత మాత గొంతకనూ వింటున్నాను"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ