Virat Kohli Anushka: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి, నిజమేనా?
Virat Kohli Anushka: విరాట్ కోహ్లీ- అనుష్క శర్మలు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది.
![Virat Kohli Anushka: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి, నిజమేనా? Virat Kohli Anushka Will Be Parents Second Child Rumours Virat Kohli Anushka: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి, నిజమేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/30/ba43b076f1b2ab1803e9155f39692dbc1696064651153754_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Virat Kohli Anushka: మరికొన్ని రోజుల్లో వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. ఈసారి భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో నెం.1 గా ఈ మహాసంగ్రామంలో పాల్గొనబోతోంది. ఈ మెగా పోటీల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు.. దేశాన్ని ఛాంపియన్ గా నిలిపేందుకు ప్లేయర్ విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలోనే విరాట్ ఇంటి నుంచి ఓ సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. దీనికి సంబంధించి కోహ్లి కానీ, అనుష్క కానీ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు చేయలేదు.
హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, అనుష్క రెండోసారి తల్లి కాబోతోంది. విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడు. అయితే గతసారి మాదిరిగానే ఈసారి కూడా ఈ గుడ్ న్యూస్ ను కాస్తంత ఆలస్యంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లి - అనుష్క జంట 2021 జనవరిలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి సంతానం ఆడపిల్ల. కోహ్లి- అనుష్క తమ కుమార్తెకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ పేర్లు కలిసేలా వామిక అనే పేరు పెట్టారు.
కోహి, అనుష్క ఇద్దరూ తమ గారాలపట్టిని మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. వామికను ఇప్పటి వరకు ప్రజలకు దూరంగానే ఉంచింది ఈ జంట. వామిక ముఖాన్ని చూపే ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. తమ కుమార్తెకు సంబంధించి ఏ ఫోటోను పోస్టు చేయలేదు. తమ కుమార్తె విషయంలో కోహ్లీ- అనుష్క చాలా గోప్యంగా ఉంచుతున్నారు. తమ బిడ్డకు అర్థం చేసుకునే పరిజ్ఞానం వచ్చి, తనే సొంతంగా ఎంపిక చేసుకునే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు విరాట్ కోహ్లీ- అనుష్క గతంలో ప్రకటించారు.
2017 లో పెళ్లి చేసుకున్నారు విరాట్ కోహ్లీ - అనుష్క. వారిద్దరూ రిలేషన్ లో ఉన్న విషయంలో సోషల్ మీడియాలో పుకార్లలుగా వచ్చింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తమ పెళ్లి గురించి ప్రకటించారు. పెళ్లి అయిన 4 సంవత్సరాల తర్వాత విరుష్క జంట కుమార్తెకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)