Viral Video: హెల్మెట్‌లో దూరిన బుల్లి కోబ్రా, హడలిపోయిన బైకర్ - వైరల్ వీడియో
Viral Video: త్రిసూర్‌లోని ఓ బైకర్ హెల్మెట్‌లో బుల్లి కోబ్రా దూరి హడలెత్తించింది.

Viral Video:
హెల్మెట్‌లో పాము..
హెల్మెట్‌లో పాము చూసి ఓ బైకర్ హడలి పోయాడు. కేరళలోని త్రిసూర్‌లో జరిగిందీ ఘటన. చాలా క్యాజువల్‌గా స్కూటీపైన హెల్మెట్ పెట్టాడా వ్యక్తి. సాయంత్రం వచ్చి బైక్ స్టార్ట్ చేసి హెల్మెట్ పెట్టుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తరవాత హెల్మెట్‌లో ఓదో కదులుతున్నట్టుగా అనిపించింది. ఏదైనా పురుగు దూరిందేమో అనుకున్నాడు. చాలా సేపటి వరకూ అది కదులుతూనే ఉంది. పాము ఉందేమో అన్న డౌట్ వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్‌ల దగ్గరికి వెళ్లి హెల్మెట్ ఇచ్చాడు. ఓ స్నేక్ వాలంటీర్ వెంటనే ఆ హెల్మెట్ తీసుకున్నాడు. చాలా సేపు వెతికాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. అందులో విషసర్పం ఉందని. ఓ చిన్న కోబ్రా అందులో నక్కి ఉంది. వెంటనే గుర్తించి బయటకు తీశాడు. ఇది చూసి ఆ బైకర్ షాక్ అయ్యాడు. పెద్ద పాముల కాటు కన్నా చిన్న పాముల కాటే చాలా ప్రమాదకరమట. అందుకే అంతగా వణికిపోయాడు. ఒక్కసారి కాటు వేసినా ప్రాణాలకే ప్రమాదం. ఈ పాము పిల్లని చాలా చాకచక్యంగా బయటకు తీశాడు స్నేక్ వాలంటీర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాములు ఎప్పుడు వచ్చి ఇళ్లలో దూరుతాయో ఎవరూ కనిపెట్టలేరు. చిన్న సందు దొరికినా వచ్చేస్తాయి. ఎక్కడో దాక్కుంటాయి. ఇల్లు సర్దుతుంటేనో, అనుకోకుండానో అవి మన కంట పడతాయి. గతంలో కర్ణాటకలోని మైసూరులోనూ ఇదే జరిగింది. వెచ్చగా ఉందనకుందేమో..ఓ కోబ్రా షూలో దాక్కుంది. పాములు పట్టుకునే వ్యక్తి వచ్చి దాన్ని బయటకు తీసేందుకు చాలానే కష్టపడ్డాడు. స్నేక్ హుక్‌తో షూని అలా టచ్ చేశాడో లేదో..వెంటనే పడగ విప్పి బుస కొట్టింది కోబ్రా. ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా...వైరల్ అయింది. షూ వేసుకునేందుకు చూసిన వ్యక్తి...లోపల పాముని చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ వ్యక్తి వచ్చి షూలో నుంచి పాముని బయటకు తీశాడు. ఇలా షూలో పాము దాక్కుని అందరినీ హడలెత్తించటం ఇదే తొలిసారి కాదు. తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు అందులో లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఎలాగోలా ఆ పామును బయటకు పంపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపాము వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Shocking video of cobra #snake in Mysore, Karnataka hiding inside the shoe.
— Bharathirajan (@bharathircc) October 10, 2022
#ViralVideo #Cobra #Rescued #Shoes #Karnataka pic.twitter.com/rJmVN5W1ne
Also Read: Israel Attack: ఇజ్రాయెల్‌లో పాలస్తీనా మిలిటెంట్ల అరాచకాలు - వైరల్ అవుతున్న ఘోరమైన దృశ్యాలు !





















