ఢిల్లీ మెట్రో రైల్‌లో ముద్దులతో మైమరిచిపోయిన జంట, వైరల్ అవుతున్న వీడియో
Viral Video: ఢిల్లీ మెట్రోలో ఓ జంట ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
అందరి ముందూ ముద్దులు..
ఢిల్లీ మెట్రోలో ఓ జంట చుట్టూ ఉన్న వాళ్లను పట్టించుకోకుండా ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే చాలా సార్లు ఢిల్లీ మెట్రో రైళ్లలో ఇలాంటివి జరిగాయి. ప్రయాణికులు ఇలాంటివి చూడలేక తెగ ఇబ్బందులు పడుతున్నారు. కంప్లెయింట్ ఇచ్చినా మెట్రో అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా...ప్రేమ జంటలు ఇలా అందరి ముందే సరసాలాడుతున్నారు. ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ..ఇప్పుడు మరో వీడియో వైరల్ అవుతోంది. ఓ జంట మైమరిచిపోయి ముద్దులు పెట్టుకుంది. వాళ్ల ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద ఇది జరిగినట్టు తెలిసింది. ఢిల్లీ మెట్రో అధికారులు ప్రయాణికులకు ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు. వార్నింగ్ కూడా ఇచ్చారు. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే విధంగా ప్రవర్తించొద్దని తేల్చిచెప్పారు. కానీ...ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాం..? ఏం చేస్తున్నాం..? అనే ఆలోచనే లేకుండా ఇలా రెచ్చిపోతున్నాయి జంటలు.
Another emotional video of Anand Vihar #delhimetro (OYO).
— Postman (@Postman_46) September 21, 2023
Maybe we have forgotten that love is blind, people are not.#HBDAtlee #ISKCON #ICCRankings #JustinTrudeau #Shubh #MindfulLiving #PeaceDay #CHEN #TejRan #ShafaliVerma pic.twitter.com/EKSJs2p54d
ఢిల్లీ మెట్రోపై ఆగ్రహం..
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఢిల్లీ మెట్రో తీరుపై మండి పడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు ఈ వీడియో తీసిన వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్లని వీడియో తీసే హక్కు ఎవరిచ్చారంటూ మండి పడుతున్నారు. పక్క వాళ్ల జీవితంలోకి తొంగి చూడడం మానేయాలంటే సలహాలిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ఢిల్లీ మెట్రో అధికారులు ఇలాంటి చర్యలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. స్టేషన్‌ల వద్ద నిఘా పెడుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది మఫ్తీలో రైళ్లు ఎక్కి అభ్యంతరకరంగా ప్రవర్తించిన వాళ్లు గుర్తించి చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు. అయినా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే..ఈ వీడియో ఎప్పటిది అన్న క్లారిటీ మాత్రం లేదు.
మహిళల కొట్లాట..
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడ్డారు. ఒకరినొకరు వేలు చూపించుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఓ మహిళ వారిని వారించడానికి యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన కూడా లేకుండా గొడవపడ్డారు. అందులో గులాబీ రంగు దుస్తులు ధరించిన ఒక మహిళ, నల్లటి దుస్తులను ధరించిన మరో మహిళపై అరుస్తూ కనిపించింది. "హా హు మై పాగల్ (అవును నాకు పిచ్చి ఉంది)" అని ఆమె ఆ స్త్రీపై అరుస్తుంది. అవతలి మహిళ స్పందిస్తూ “భౌక్, తుజే జిత్నా భౌక్నా (మీకు కావలసినంత అరవండి)” అని ఆమె చెప్పడం వినిపించింది. మెట్రో అధికారులు గొడవలకు దూరంగా ఉండాలని ప్రయాణికులను కోరుతున్నా... వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మరొక క్లిప్‌లో పింక్ సూట్ ధరించిన మహిళ అదే మెట్రో కోచ్‌లో మరొక ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగింది. మరొక మహిళ ఆ వాగ్వాదాన్ని రికార్డ్ చేసింది. దీనిపై మెట్ర ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Just Delhi Metro & Women !!!#W0men !!#DelhiMetro
— The DV Warrior (Parody) (@BakraofDv) August 3, 2023
😂😂😂 pic.twitter.com/BRjVJTQkJ7
Also Read: పార్లమెంట్లో ముస్లిం ఎంపీపై మూకదాడి జరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి - ఒవైసీ ఆగ్రహం