![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో
Viral Video: బిహార్‌లో యాక్సిడెంట్ అయిన కార్‌లో నుంచి స్థానికులు మందు బాటిల్స్ ఎత్తుకెళ్లారు.
![యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో Viral Video Bihar People loot liquor from car after crash on highway యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/01/18e67be9dd4dc331d5e1f519c030cf0f1698820330768517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Viral Video:
కార్‌లో లిక్కర్ బాటిల్స్..
బిహార్‌లో ప్రమాదానికి గురైన కార్‌లో నుంచి లిక్కర్‌ని ఎత్తుకెళ్లారు స్థానికులు. రెండు కార్లు ఢీకొట్టుకుని నడి రోడ్డుపై క్రాష్ అయ్యాయి. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కార్‌లో లిక్కర్ బాటిల్స్ ఉండడాన్ని గమనించారు. వెంటనే వాటిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. నేషనల్ హైవే-2పై ఈ ఘటన చోటు చేసుకుంది. 2016 నుంచి రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలవుతోంది. ఈ క్రమంలోనే ఒకేచోట అన్ని బాటిల్స్ చూసే సరికి అంతా ఎగబడ్డారు. ఫారిన్ లిక్కర్‌ని క్యారీ చేస్తున్న కార్ ఓ కార్‌ని ఢీకొట్టింది. అక్టోబర్ 30న ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ కార్‌లోని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. అందులో లిక్కర్ బాటిల్స్ కార్టన్స్ కనిపించాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న వాళ్లతో పాటు అటుగా వెళ్తున్న వాళ్లు కూడా ఆగి మరీ కార్‌పై ఎగబడి మందు బాటిల్స్ ఎత్తుకెళ్లారు. చేతికి ఎన్ని అందితే అన్ని లాక్కుని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చినా ఎవరూ ఆగలేదు. వాళ్ల ముందే మందు బాటిల్స్ పట్టుకుని అటూ ఇటూ పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఆధారంగా బాటిల్స్ ఎత్తుకెళ్లిన వాళ్లని గుర్తు పట్టి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
AThis Viral video From #Siwan Bihar
— Iron Dome 🇮🇳🚩 (@Iron4Dome) October 30, 2023
liquor bottles being looted from a car in Siwan district of Bihar. A speeding vehicle was stopped by the villagers. The driver left the car out of fear and ran away. #AndhraTrainTragedy #12thFail #DelhiLiquorPolicy #RashidKhan #TejRan Pappu pic.twitter.com/DSuDFtMDsU
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)