By: ABP Desam | Updated at : 27 Sep 2023 05:40 PM (IST)
Edited By: Pavan
బెయిల్ వచ్చినా 3 ఏళ్లు జైల్లోనే, ఈమెయిల్ చూడకుండా అధికారుల నిర్లక్ష్యం- కోర్టు జరిమానా ( Image Source : ghconline.gov.in )
Viral News: జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి మూడేళ్లు అదనంగా జైలు జీవితం గడిపేలా చేసింది. ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి.. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీని జైలు అధికారుల అధికారిక మెయిల్ కు పంపించింది. అయితే ఈ-మెయిల్ ను అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో అతడు మూడేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. గుజరాత్ జైలు అధికారుల నిర్లక్ష్యపూరిత వైఖరిపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి రూ. లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
27 ఏళ్ల చందన్‌జీ ఠాకోర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో గుజరాత్ జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి సెప్టెంబర్ 29, 2020 న హైకోర్టు శిక్షను నిలిపి వేస్తూ బెయిల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రీ జైలు అధికారులకు ఆర్డరు కాపీని ఈ-మెయిల్ లో పంపించింది. కానీ, దానిని అధికారులు ఓపెన్ చేయలేదు. దాంతో ఇప్పటి వరకు 2023 వరకు చందన్‌జీ ఠాకోర్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. తాజాగా అతడు మరోసారి బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేయడంతో జైలు అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
బెయిల్ ఆర్డరు కాపీలు కోర్టు రిజిస్ట్రీ నుంచి జైలు అధికారులకు చేరాయి. కానీ వారు ఆ మెయిల్ లోని అటాచ్ మెంట్‌ను మాత్రం ఓపెన్ చేయలేదు. అంతేకాకుండా ఆ ఈ-మెయిల్ ను జిల్లా సెషన్స్ కోర్టుకు కూడా పంపించినప్పటికీ.. అక్కడ కూడా సరైన పర్యవేక్షణ కనిపించలేదు. దోషి అదనంగా మూడేళ్ల జైలు శిక్ష అనుభవించడానికి కారణమైన జైలు అధికారులపై గుజరాత్ హైకోర్టు సీరియస్ అయింది. అతడికి రూ. లక్షల పరిహారం చెల్లించాలంది. ఆ మొత్తాన్ని 14 రోజుల వ్యవధిలో చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఏఎస్ సుపెహియా, జస్టిస్ ఎంఆర్ మెంగ్డేలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా కొవిడ్ సమయంలో ఇలా మెయిల్ లో ఇచ్చిన ఆదేశాలన్నీ అమలు అయ్యాయా? లేదా? అనే విషయాన్ని తెలియజేయాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీని ఆదేశించింది.
Indian Navy: ఇండియన్ నేవీలో సరికొత్త చరిత్ర - తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్ నియామకం
Mizoram Assembly Polls: ఎన్నికల కౌంటింగ్ వాయిదా! అసలు కారణం తెలుసా?
ఇండియాలో మొదటి ఎగ్జిట్ పోల్ సర్వే ఎప్పుడు చేశారు? ఫస్ట్ ఫైవ్ ఇవే
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
HSL Recruitment: వైజాగ్ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
/body>