Viral News: అమ్మవారికి రోబో హారతులు, సోషల్ మీడియాలో వైరల్
Viral News: కాలం మారింది. సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. పండుగల్లో సాంకేతికను వినియోగించడం సాధారణం అయిపోయింది. ఢిల్లీకి చెందిన ఒక రొబోటిక్ కంపెనీ వెరైటీగా దీపావళి వేడుకలు నిర్వహించింది.
Unique Diwali Festival 2023 News In Telugu: కాలం మారింది. సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. పండుగల్లో సాంకేతికను వినియోగించడం సాధారణం అయిపోయింది. వినాయక చవితి సందర్భంగా పలు చోట్ల వినాయకుడి ప్రతిమలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం చూశాం. అందులో వినాయకుడు ప్రదక్షిణలు చేయడం, చంద్రయాన్ వినాయకుడు, ఇస్రో వినాయకుడు, రోబో వినాయుకుడు ఉన్నాడు.
తాజాగా దీపావళి వేడుకల్లోను టెక్నాలజీని ఉపయోగించారు. ఢిల్లీకి చెందిన ఒక రొబోటిక్ కంపెనీ వెరైటీగా దీపావళి వేడుకలు నిర్వహించింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి రోబో చేతులు మీదుగా హారతులిప్పించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా’ సోషల్‌మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Delhi based robotics company Orangewood's unique Diwali celebration. pic.twitter.com/eW6vafKOqH
— Indian Tech & Infra (@IndianTechGuide) November 12, 2023
దేశవ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆనందోత్సాహాల మధ్య అంబరాన్నంటేలా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్ల ముందు, రహదార్లు, దుకాణాల వద్ద టపాసులు పేలుస్తూ చిన్నా పెద్దా కేరింతలు కొట్టారు. నరకాసుర వధ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
గ్రామాల్లో ప్రధాన కూడలి వద్దకు చేరి రంగవల్లులు, దీపాలతో అలంకరించారు. మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. చిన్నారులు, యువత.. టపాసులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వెలిగించి ఆనందాలు పంచుకున్నారు. దీపాలు, టపాసుల కాంతులతో నగరాలు వెలిగిపోయాయి. రాజకీయ నాయకులు, ప్రజలు బాణాసంచా కాలుస్తూ.. దీపావళిని ఘనంగా జరుపుకున్నారు.
వాడవాడలా దీపాల కాంతులు ఆకట్టుకున్నాయి. కుటుంబసమేతంగా బాణాసంచా కాల్చారు. దీపావళిని పురస్కరించుకుని మహిళలు ధనలక్ష్మీ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష పూజలు నిర్వహించి, అనంతరం నరకాసుర వధ కార్యక్రమం చేపట్టారు. మిఠాయిలు పంచిపెట్టి, ఆనందం పంచుకున్నారు.
వినాయకుడికి సైతం రోబో హారతి
వినాయక చవితి వేడుకల్లో సైతం రోబోను ఉపయోగించారు. ముంబైలోని లాల్‌బాగ్ పండల్‌లో టెక్నో ఆర్టిస్టిక్ గణేశా థీమ్‌తో ఈ టెక్నో గణపతిని ఏర్పాటు చేశారు. యూనివర్సల్ రోబోస్ అనే సంస్థ గణేష్ చతుర్థి నిర్వహించడానికి ఓ అప్లికేషన్ సాయంతో కోబోట్స్ అనే రోబోలను తీసుకొచ్చింది. కోబోట్స్ పురోహితుడిలా మారి హారతి ఇస్తుండగా.. ఆ సమయంలో వినాయకుడి విగ్రహం గాల్లో తేలేలా ఏర్పాటు చేశారు. రోబోలు వినాయకుడికి హారతి ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. చాలా సార్లు రోబోలతో హారతి ఇచ్చారు.