Viral News: చీకట్లో బాయ్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు ప్లాన్, ఊరు మొత్తానికి పవర్ కట్ చేసిన యువతి
Viral News: బిహార్‌లోని ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ని చీకట్లో కలిసేందుకు ఊరికి పవర్ సప్లై ఆఫ్ చేసింది.
Viral News:
బిహార్‌లో ఘటన..
బిహార్‌లోని బెత్తియా గ్రామానికి చెందిన ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు ఎవరూ ఊహించని పని చేసింది. ఊరు ఊరంతా పవర్ కట్ చేసింది. ఊరి వాళ్లు ఎవరూ చూడకుండా చీకట్లో తన ప్రియుడిని కలుసుకోవాలనుకుంది. అందుకే పవర్ సప్లై కట్ చేసింది. ఇప్పుడే కాదు. చాలా సార్లు ఇలానే చీకట్లో గుట్టుగా కలుసుకుంది ఈ జంట. చివరకు గ్రామస్థులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వారం రోజులుగా ఆ ఊళ్లో వీళ్లిద్దరి ప్రేమ కథ పెద్ద అలజడినే సృష్టించింది. పదేపదే రాత్రి పూట కరెంట్ పోతుండడంపై గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఊరికి పవర్ సప్లై అయ్యే స్టేషన్‌కి వెళ్లి ఫ్యూజులు తీసేసింది యువతి. చివరకు దీన్ని స్థానికులు కనిపెట్టారు.
"వారం రోజులుగా రాత్రి పూట పవర్ కట్ అవుతోంది. ఈ చీకటి కారణంగా చాలా ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కరెంట్ పోవడానికి ఈ యువతే కారణమని ఇన్నాళ్లకు తెలిసింది. మా ఊళ్లో ఊరికే ఎందుకు కరెంట్ పోతోందని అధికారులకు కూడా కంప్లెయింట్ ఇచ్చాం. ఇందుకు కారణమేంటో కనుక్కొనేందుకు పహారా కాశాం. కరెంట్ పోగానే వెంటనే ఈ ఇద్దరు కలుసుకోవడం గమనించాం. వాళ్లను చూసి షాక్ అయ్యాం. ఇద్దరూ కలుసుకోడానికి ఇలా ఊరికి కరెంట్ కట్ చేస్తున్నారు"
- గ్రామస్థులు
ఈ ఇద్దరినీ గుర్తించిన వెంటనే గ్రామస్థులు యువకుడిపై దాడి చేశారు. రాళ్లతో కొట్టారు. తన ప్రియుడిని కొట్టొద్దని ఆ యువతి వేడుకుంది. అయినా వినకుండా దాడి చేశారు. ఆ యువకుడు తన గ్యాంగ్‌కి కాల్ చేసి పిలిపించాడు. ఇంత గొడవ జరిగిన తరవాత ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకున్నాయి. చివరకు వాళ్ల పెళ్లికి ఒప్పుకున్నారు. స్థానిక ఆలయంలో ఇద్దరికీ పెళ్లి చేశారు.
భార్యకు పెళ్లి చేసిన భర్త..
బిహార్‌లోని నవాడా జిల్లాలో ఓ భర్త తన భార్యకు, ఆమె బాయ్‌ఫ్రెండ్‌కి దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు. ఇద్దరినీ ఆశీర్వదించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఆలయంలో వీళ్లిద్దరికీ పెళ్లి చేశాడు ఆ భర్త. తన ఎదురుగానే బాయ్‌ఫ్రెండ్‌తో ఆమె నుదుటిపై సిందూరం పెట్టించి మరీ ఒక్కటి చేశాడు. పక్కనే ఉన్న వాళ్లంతా దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు కథేంటంటే...భర్త ఇంట్లో లేని సమయంలో ఆ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు నేరుగా ఇంటికి వెళ్లింది. అయితే...కుటుంబ సభ్యులు దీన్ని గమనించి ఇద్దరినీ పట్టుకున్నారు. వెంటనే ఆ బాయ్‌ఫ్రెండ్‌ని చితకబాదారు. ఇద్దరినీ కట్టేశారు. ఊరు విడిచిపెట్టి వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు. ఎప్పుడైతే ఆ మహిళ భర్త సీన్‌లో ఎంటర్ అయ్యాడో అంతా మారిపోయింది. వాళ్లిద్దరినీ అలా చూడగానే ఏమీ ఆలోచించకుండా పక్కనే ఉన్న టెంపుల్‌కి తీసుకెళ్లాడు. బాయ్‌ఫ్రెండ్‌తో సిందూరం దిద్దించి పెళ్లి చేశాడు. అతనికీ అప్పటికే పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందినప్పటికీ...ఎవరూ ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు.
Also Read: డ్యూటీ చేస్తూ ఫోన్ వాడిన ఎంప్లాయ్, ఉద్యోగంలో నుంచి తీసేసిన రెస్టారెంట్