News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Viral News: రెండు నిమిషాలు హిందీలో మాట్లాడినందుకు ఉద్యోగం పోయింది!

Viral News: రెండు నిమిషాలు హిందీలో మాట్లాడినందుకు ఓ ఇండో అమెరికన్ టెకీ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. చావుబతుకుల్లో ఉన్న బంధువుతో ఫోన్‌లో హిందీలో మాట్లాడాడని యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించంది.

FOLLOW US: 
Share:

Viral News: రెండు నిమిషాలు హిందీలో మాట్లాడినందుకు ఓ ఇండో అమెరికన్ ఇంజినీర్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. చావుబతుకుల్లో ఉన్న బంధువుతో ఫోన్‌లో హిందీలో మాట్లాడాడని యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించంది. దీనిపై సదరు వ్యక్తి కోర్టు కెక్కాడు. తనను ఉద్దేశపూర్వకంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.  వివరాలు.. భారత సంతతికి చెందిన అనిల్‌ వర్ష్నే (78) అమెరికాలో 2002 నుంచి అమెరికాలో ప్రముఖ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ విభాగంలో పార్సన్స్ కార్పొరేషన్‌ అనే సంస్థలో సీనియర్‌ సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా పనిచేసేవారు.

2022 సెప్టెంబర్ 26న అనిల్‌ భారత్‌లోని ఆస్పత్రిలో చావు బ్రతుకుల్లో ఉన్న తన బావ కేసీ గుప్తాతో వీడియో కాల్‌ మాట్లాడాడు. ఆఫీస్‌లో ఎవరూ లేనిచోట సమయంలో మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ (MDA)కి చెందిన వారు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత  ఖాళీ క్యాబిన్‌లో అనిల్‌ 2 నిముషాల పాటు మాట్లాడాడు. అయితే అనిల్‌ ఫోన్‌లో మాట్లాడటం చూసిన సహోద్యోగి ఒకరు ఇక్కడ ఫోన్‌ మాట్లాడకూడదని వారించాడు. దీంతో  కాల్‌ కట్‌ చేశాడు. అదే అతని పాలిట శాపమైంది. 

గూఢచారి ముద్ర!
దీనిపై సహోద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తనకు అర్ధం కాని భాషలో అనిల్ ఫోన్‌ కాల్‌ మాట్లాడాడని, ఏజెన్సీకి సంబంధించిన గోప్య సమాచారం చేరవేశాడని ఆరోపించారు. ఫోన్‌ మాట్లాడి భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించాడనే ఆరోపించడంతో ఉన్నతాధికారులు అప్పటికప్పుడు అతన్ని ఉద్యోగం నుంచి అప్పటికప్పుడు తొలగించారు. అంతేకాకుండా భవిష్యత్తులో మిసైల్‌ డిఫెన్స్‌ ఏజెన్సీలో పనిచేయకుండా బ్లాక్‌ మార్క్‌ జారీ చేశారు. దీంతో అనిల్‌ జులై 24న సదరు ఏజెన్సీ కంపెనీపై కోర్టును ఆశ్రయించాడు. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని, వివక్షపూరితంగా పక్షపాతంతో తనపై ఆరోపణలు చేశారంటూ తన దావాలో పేర్కొన్నారు. సంస్థ చర్యలతో గత సెప్టెంబర్ నుంచి తాను ఉపాధి కోల్పోయానని, తనను మానసిక క్షోభకు గురి చేశారని వాపోయారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తేల్చడానికి విచారణ కూడా చేయలేదని ఆరోపించాడు. అంతేకాకుండా కోర్టులో లాయర్ల ఫీజులు, ఖర్చులు కూడా కంపెనీయే భరించాలని దావాలో డిమాండ్‌ చేశారు. 

1968లో అమెరికాకు వలస
1968లో అమెరికాకు వలస వచ్చిన వర్ష్నీ అమెరికా పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డాడు. ఆయన భార్య శశి 1989 నుంచి నాసాలో పనిచేస్తోంది. సిస్టమ్స్ ఇంజనీరింగ్‌ విభాగంలో భూమి ఆధారిత క్షిపణి రక్షణ కార్యక్రమంలో 5 మిలియన్లను ఆదా చేసినందుకు ఇదే కంపెనీలో ‘కాంట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్’గా ప్రపంశలు కూడా అందుకున్నాడు. బాలిస్టిక్ క్షిపణి బెదిరింపుల నుంచి అమెరికాను, దాని భాగస్వామ్య దళాలను రక్షించే సమీకృత, లేయర్డ్ క్షిపణి రక్షణ వ్యవస్థల అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని దావాలో పేర్కొన్నాడు. తన పూర్వ ఉద్యోగ రికార్డులను సైతం దావాలో పొందుపరిచాడు. తనపై వేసిన క్రమశిక్షణ రాహిత్య చర్యలను ఉపసంహరించుకోవాలని వర్ష్నీ కోరారు. ఒక వేళ తనను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోకపోతే పూర్తి ప్రయోజనాలతో కూడిన ముందస్తు చెల్లింపులు, న్యాయవాద రుసుము, మానసిక వేదన అనుభవించినందుకు నష్టపరిహారాన్ని కోరారు. ఇక దీనిపై పార్సల్స్‌ కంపెనీ ఇంకా స్పందించలేదు.

Published at : 03 Aug 2023 01:23 PM (IST) Tags: Hindi Viral News Phone Call Indian-American engineer

ఇవి కూడా చూడండి

Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం

Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !