Vande Bharat Express: కాషాయ రంగులో వందేభారత్ ట్రైన్‌లు, త్వరలో పట్టాలపైకి!
Vande Bharat Express: వందేభారత్ ట్రైన్‌లు ఇకపై కాషాయ రంగులో కనిపించనున్నాయి.
![Vande Bharat Express: కాషాయ రంగులో వందేభారత్ ట్రైన్‌లు, త్వరలో పట్టాలపైకి! Vande Bharat Express will now be seen in orange, railway minister shared new pictures Vande Bharat Express: కాషాయ రంగులో వందేభారత్ ట్రైన్‌లు, త్వరలో పట్టాలపైకి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/63388a5e25e575137fef8687827318791688878240400517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vande Bharat Express:
రంగు మారింది..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రంగుని మార్చేసింది రైల్వే శాఖ. అంతకు ముందు ఉన్న బ్లూ కలర్‌ని కాషాయ రంగులోకి మార్చింది. ఇకపై అందుబాటులోకి వచ్చే వందేభారత్ ట్రైన్‌లు ఇదే రంగులో కనిపించనున్నాయి. ఈ కొత్త కాషాయ వందేభారత్ ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ఈ రైళ్లు తయారు చేసే చెన్నైలోని Integral Coach Factoryలో ఉంది. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో 25 రకాల డిజైన్‌లతో వందేభారత్ ట్రైన్‌లు తయారు చేశారు. ఇవన్నీ సర్వీస్‌లు అందిస్తున్నాయి. మరో రెండింటిని రిజర్వ్‌లో ఉంచారు. 28వ వందేభారత్ ట్రైన్‌కి మాత్రం ట్రయల్ బేసిస్‌లో ఇలా రంగు మార్చారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. సేఫ్‌టీ మెజర్స్‌ని పరిశీలించారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో చేసిన మార్పులుచేర్పులనూ అడిగి తెలుసుకున్నారు. ఆ తరవాత ఆయన కీలక వివరాలు వెల్లడించారు. దేశ త్రివర్ణ ప్రతాకం నుంచి స్ఫూర్తి పొంది వందేభారత్‌కి కాషాయ రంగు వేసినట్టు చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా వీటిని తయారు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
"ఇది మేకిన్ ఇండియా కాన్సెప్ట్. అంటే...ఇంజనీర్‌లు, టెక్నీషియన్లు అంతా ఇండియాకు చెందిన వాళ్లే. ఇప్పటికే కొన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఫీల్డ్ యూనిట్‌ల నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటున్నాం. ఏసీలు ఎలా పని చేస్తున్నాయి..? టాయిలెట్‌లు శుభ్రంగా ఉంటున్నాయా లేదా అన్న వివరాలు అడుగుతున్నాం. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే వందేభారత్ ట్రైన్‌లలో మార్పులు చేస్తున్నాం. డిజైన్‌లోనూ మార్పులు జరుగుతున్నాయి"
- అశ్వినీ వైష్ణవ్, రైల్వేమంత్రి
Inspected Vande Bharat train production at ICF, Chennai. pic.twitter.com/9RXmL5q9zR
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 8, 2023
టికెట్ ధరలు తగ్గింపు..
రైల్వే బోర్డ్ ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. వందేభారత్‌తో పాటు అన్ని AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రైళ్ల టికెట్ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 25% మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. గత నెల రోజులుగా ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ 50% కన్నా తక్కువకు పడిపోయింది. అందుకే...ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే బోర్డ్ తెలిపింది. ఈ రైళ్ల వినియోగం మరింత పెంచేందుకు టికెట్ ధరల్ని తగ్గించినట్టు వివరించింది. ఈ ధరలు తగ్గించే అధికారం జోనల్ రైల్వేస్‌కే అప్పగించింది రైల్వే శాఖ. అయితే..బేసిక్ ఫేర్‌పైనే ఈ 25% తగ్గింపు ఉంటుంది. మిగతా ఛార్జీలు..అంటే రిజర్వేషన్ ఛార్జ్‌లు, సూపర్ ఫాస్ట్ సర్ఛార్జ్, GST ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే ప్రకటించింది. ఈ తగ్గింపు కేవలం ఏసీ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ట్రైన్లకు మాత్రమే వర్తిస్తుంది. టికెట్ బేస్ ఫేర్‌పై 25% తగ్గింపు లభిస్తుంది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే...గత నెల రోజుల్లో 50% తక్కువ ఆక్యుపెన్సీ నమోదైన రైళ్లలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎండ్ టు ఎండ్ జర్నీకే కాకుండా మధ్య స్టేషన్లలో దిగిపోయే వారు కూడా 25% తగ్గింపుతో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. దాదాపు ఆర్నెల్ల పాటు ఈ స్కీమ్ కొనసాగే అవకాశాలున్నాయి.
Also Read: GSTN: 'జీఎస్టీ' నెట్వర్క్ ఇక మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి! దర్యాప్తు సంస్థలకు ప్రయోజనం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)