Uttarkashi Tunnel News: బయటకు తీయడానికి మరో 2-3 రోజులు పడుతుండొచ్చు - ఉత్తరాఖండ్ ఘటనపై కేంద్రమంత్రి
Uttarkashi Tunnel Collapse: సొరంగంలో చిక్కుకున్న వాళ్లను బయటకు తీసేందుకు మరో మూడు రోజులు పడుతుండొచ్చు అని మంత్రి వెల్లడించారు.
Uttarkashi Tunnel Collapse Updates:
థాయ్‌లాండ్ నుంచి స్పెషల్ టీమ్..
ఉత్తరాఖండ్ సొరంగంలో (Silkyara Tunnel) చిక్కుకున్న40 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ రెస్క్యూ ఆపరేషన్ (Uttarakhand Tunnel News) కోసం థాయ్‌లాండ్ నుంచి స్పెషల్ టీమ్ వచ్చింది. కేంద్రమంత్రి వీకే సింగ్ ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలపై ఆరా తీశారు. థాయ్‌లాండ్ నుంచి ప్రత్యేక టీమ్ వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ ((Uttarakhand Tunnel Collapse) పూర్తి కావడానికి కనీసం 2-3 రోజుల సమయం పట్టే అవకాశముందని మంత్రి వెల్లడించారు. అయితే...ఇంత కన్నా ముందే ఆపరేషన్ పూర్తయ్యే అవకాశమున్నా గరిష్ఠంగా మూడు రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. ఇక్కడి బండరాళ్లను డ్రిల్ చేసేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా American auger మెషీన్ తెప్పించారు. దీంతో పాటు విదేశీ నిపుణులతో అధికారులు సంప్రదింపులు జరిపారు. రెస్క్యూ ఆపరేషన్ (Thai Rescue Team) ఎలా చేపడితో బాగుంటుందో సలహాలు తీసుకున్నారు. థాయ్‌లాండ్‌లో ఓ సంస్థ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఆ టెక్నాలజీ గురించీ ఆరా తీసిన అధికారులు...ఆ టీమ్‌ని ఇక్కడికి రప్పించారు.
VIDEO | Uttarkarshi tunnel collapse: Efforts underway to rescue 40 workers trapped in an under-construction tunnel that collapsed four days back. pic.twitter.com/w7PspPysjz
— Press Trust of India (@PTI_News) November 16, 2023
డ్రిల్లింగ్ సక్సెస్ అయితేనే..
అమెరికన్ ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ మొదలు పెట్టారు. గంటకు 4-5 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయగల కెపాసిటీ ఈ మెషీన్ సొంతం. అంతకు ముందు ఓ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేపట్టినా అది పని చేయలేదు. అందుకే అమెరికా నుంచి తెప్పించారు. అందుకోసం మూడు IAF ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగించారు. ఉత్తరాఖండ్‌కి వచ్చిన తరవాత ఆ మెషీన్‌ని అసెంబుల్ చేశారు. వీలైనంత త్వరగా కార్మికులను బయటకు తీసుకొస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సొరంగంలో పెద్ద రంధ్రం చేసి అందులో నుంచి 800mm,900mm స్టీల్ పైప్‌లను జొప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. వాటి ద్వారా కార్మికులు బయటకు వచ్చేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. అయితే...టెక్నికల్ ఇష్యూస్ ఏమీ రాకపోతే ఈ ఆపరేషన్‌కి కనీసం 2-3 రోజులు పట్టే అవకాశముంది. 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 96 గంటలుగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. నవంబర్ 12వ తేదీన ఉత్తరకాశీలోని ఈ సొరంగం ఒక్కసారిగా కుప్ప కూలింది. అప్పటి నుంచి శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లు విలవిలలాడిపోతున్నారు. అయితే...బయటకు తీసుకొచ్చే లోగా వాళ్లకు అసరమైనవి అందించేందుకు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతానికి పైప్‌ల ద్వారా ఆక్సిజన్ అందిస్తోంది.
VIDEO | "The (heavy drilling) machine has been installed and the rescue operation will be resumed shortly. Those trapped are healthy and fine, and they shall be rescued shortly," says GL Nath, PRO, Navayuga Engineering Company Limited. pic.twitter.com/L2QhaCya6R
— Press Trust of India (@PTI_News) November 16, 2023
Also Read: PMGKAY News: ఏడాది పాటు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు, కేంద్రం కీలక ప్రకటన