Alexa Technology: 'అలెక్సా, కుక్కలా అరువు' - ఆ బాలిక సమయ స్ఫూర్తికి హ్యాట్సాఫ్, ఏం జరిగిందంటే?
Uttarapradesh News: యూపీకి చెందిన ఓ బాలిక టెక్నాలజీ సాయంతో సమయ స్ఫూర్తిగా వ్యవహరించి చిన్నారి ప్రాణాలు సహా తన ప్రాణాలు సైతం కాపాడుకుంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే..!
Up Girl Saves Child Life With Ai Technology: ఏదైనా ఊహించని ప్రమాదం ఎదురైతే కంగారు పడతాం. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు గురవుతాం. అయితే, యూపీకి చెందిన ఓ బాలిక మాత్రం తన సమయస్ఫూర్తితో తన చిన్నారి మేనకోడలి ప్రాణాలు మాత్రమే కాకుండా తన ప్రాణాలను సైతం రక్షించుకోగలిగింది. అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో ఒక్కసారిగా మీద పడ్డ కోతుల గుంపు నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. ఆమె సమయస్ఫూర్తికి ఫిదా అయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా బాలికపై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా ఆమె భవిష్యత్తులో కార్పొరేట్ రంగంలో పని చేయాలనుకుంటే తమ కంపెనీలో చేరొచ్చంటూ జాబ్ ఆఫర్ ఇచ్చారు.
ఇదీ జరిగింది
ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని బస్తీలో ఉన్న ఆవాస్ వికాస్ కాలనీలో నికిత (13) అనే బాలిక తన 15 నెలల మేనకోడలు వామికతో కలిసి సోఫాలో ఆడుకుంటోంది. కుటుంబ సభ్యులు వేరే వేరే గదుల్లో ఉన్నారు. ఆ సమయంలో డోర్ తీసి ఉండడంతో కోతుల గుంపు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడింది. వానరాలు కిచెన్, ఇంట్లోని సామాన్లు చిందరవందర చేశాయి. కొన్ని కోతులు వీరు ఉంటున్న వైపు రావడం గమనించిన బాలిక తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ సమయంలో ఆమెకు ఫ్రిజ్ పై ఉన్న అలెక్సా (Alexa) డివైజ్ కనిపించింది.
#WATCH | Uttar Pradesh: A girl named Nikita in Basti district saved her younger sister and herself by using the voice of the Alexa device when monkeys entered their home.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024
Nikita says, "A few guests visited our home and they left the gate open. Monkeys entered the kitchen and… pic.twitter.com/hldLA0wvZS
'కుక్కలా అరువు'
'అలెక్సా' డివైజ్ ను చూసిన నికిత సమయస్ఫూర్తితో వ్యవహరించింది. వెంటనేే డివైజ్ కు 'అలెక్సా కుక్కలా గట్టిగా మొరుగు' అంటూ వాయిస్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో, వెంటనే అలెక్సా డివైజ్ నుంచి కుక్కలా గట్టిగా అరుపులు వినిపించడం ప్రారంభమైంది. ఈ అరుపులతో భయపడిన కోతులు అక్కడి నుంచి పారిపోయాయి. ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా, ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి 15 నెలల తన మేనకోడలి ప్రాణాలతో పాటు తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. పిల్లలిద్దరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో బాలికపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. టెక్నాలజీ సాయంతో తెలివిగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడిందంటూ అంతా అభినందించారు. 'మా ఇంటికి కొంతమంది అతిథులు వచ్చారు. వారు వెళ్తున్న సమయంలో గేట్ తెరిచే ఉంచారు. దీంతో కోతులు ఇంట్లో చొరబడి చిందరవందర చేశాయి. మా వైపు రాగా పాపతో పాటు నేను కూడా భయపడ్డాను. అప్పుడే ఫ్రిజ్ పై ఉన్న అలెక్సాను చూసి కుక్కలా అరవమని ఆర్డర్స్ ఇచ్చాను. ఆ అరుపు శబ్ధాలకు కోతులు పారిపోయాయి.' అని నికిత తెలిపారు.
కాగా, 'అలెక్సా'ను వాయిస్ కమాండ్స్ తో వివిధ అవసరాలకు వాడతారు. ఈ పరికరం అమెజాన్ క్లౌడ్ ఆధారిత వర్చువల్ వాయిస్ అసిస్టెంట్. ఇంట్లో స్మార్ట్ హోమ్ పరికరాలు నియంత్రించడం, వాతావరణ వివరాలు తెలియజేయడం, మన ఆదేశాలకు అనుగుణంగా రెస్పాండ్ అవడం వంటివి చేస్తుంది.
ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
The dominant question of our era is whether we will become slaves or masters of technology.
— anand mahindra (@anandmahindra) April 6, 2024
The story of this young girl provides comfort that technology will always be an ENABLER of human ingenuity.
Her quick thinking was extraordinary.
What she demonstrated was the… https://t.co/HyTyuZzZBK
'అలెక్సా' సాయంతో చిన్నారి ప్రాణాలు సహా తన ప్రాణాలు కాపాడుకున్న బాలికను ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఆమెకు ఊహించని ఆఫర్ ఇచ్చారు. టెక్నాలజీ ఎప్పుడూ మానవ చాతుర్యానికి దోహదపడుతుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఊహించని ఘటన ఎదురైనప్పుడు ఆ బాలిక సమయస్ఫూర్తి అభినందనీయమని పేర్కొన్నారు. 'ఆమె చదువు పూర్తి చేసి ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పని చేయాలని నిర్ణయించుకుంటే మా కంపెనీలో ఉద్యోగంలో చేరొచ్చు' అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Also Read: AI టెక్నాలజీతో ఎన్నికల్ని ప్రభావితం చేయొచ్చా? ఓటర్ల మైండ్‌సెట్‌ని మార్చే వీలుంటుందా?