(Source: ECI/ABP News/ABP Majha)
Uttarakhand Tunnel Rescue Updates: సొరంగంలోకి సక్సెస్‌ఫుల్‌గా తొలి రెస్క్యూ పైప్, రాత్రిలోగా బయటకు రానున్న కార్మికులు
Uttarakhand Tunnel Rescue: రెస్క్యూ సిబ్బంది ఎస్కేప్ రూట్ కోసం తొలిపైప్‌ని సొరంగంలోకి విజయవంతంగా అమర్చారు.
Uttarakhand Tunnel Rescue Operation Updates:
తొలి పైప్ ఇన్‌స్టాలేషన్ సక్సెస్..
ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ (Uttarakhand tunnel rescue) విజయవంతంగా కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లోనే కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే రెస్క్యూ ఆపరేషన్‌లో అత్యంత కీలకమైన పరిణామం జరిగింది. ఎస్కేప్ రూట్ కోసం రెండు పైప్‌లను (Uttarakhand tunnel escape route) అమర్చి అందులో నుంచి కార్మికులను బయటకు తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు ఓ పైప్‌ని (Uttarakhand Tunnel Pipes) ఇప్పటికే సక్సెస్‌పుల్‌గా అమర్చారు. దానికి మరో పైప్‌ని అమర్చితే ఎస్కేప్ రూట్ తయారవుతుంది. ఈ ప్రక్రియ సాయంత్రం నాటికి పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. రాత్రిలోగా శిథిలాల కింద చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు వస్తారని భరోసానిచ్చారు. ఇప్పటికే ఆయా కార్మికుల కుటుంబ సభ్యులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ని పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయని వివరించారు.
"45 మీటర్ల పైప్‌లైన్‌ని విజయవంతంగా అమర్చాం. అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ మెషీన్‌తో పైప్‌ని అమర్చగలిగాం. రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికీ కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినా సరే వాటన్నింటినీ అధిగమించి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తామన్న భరోసా ఉంది. వాళ్లు బయటకు వచ్చాక అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశాం. ఆంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. హాస్పిటల్స్‌లోనూ బెడ్స్ రెడీ చేశాం. వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు"
- పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ సీఎం
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Uttarakhand CM Pushkar Singh Dhami says "45 metres of pipeline has been laid through auger machine. The rescue is at its final stages. There are some obstacles,. but I hope that the workers are rescued as early as possible.… pic.twitter.com/FJRkCvX8v7
— ANI (@ANI) November 23, 2023
ఈ సొరంగం ఎంట్రెన్స్ వద్ద నిర్మించిన ఆలయం వద్ద పుష్కర్ సింగ్ ధామి పూజలు నిర్వహించారు. కార్మికులంతా సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థనలు చేశారు.
Uttarkashi (Uttarakhand) tunnel rescue | Uttarakhand CM Pushkar Singh Dhami reached Silkyara Tunnel (Uttarakashi) and offered prayers at a temple that has been built at the main entrance of the tunnel where rescue operations to bring out the trapped workers are underway.
— ANI (@ANI) November 23, 2023
(Pic… pic.twitter.com/voYuZV9D5u
Also Read: Regulation on Deepfakes: డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి కొత్త చట్టం! కీలక ప్రకటన చేసిన కేంద్రం