By: Ram Manohar | Updated at : 12 Aug 2023 12:41 PM (IST)
ఉత్తరాఖండ్‌లో కొండ చరియలు విరిగి పడి కార్‌లో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు.
Uttarakhand Rains:
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు
ఉత్తరాఖండ్‌లోని భారీ వర్షాలకు కేదార్‌నాథ్ యాత్రకు ఆటంకాలు తప్పడం లేదు. రుద్రప్రయాగ్ జిల్లాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఘోర విషాదం చోటు చేసుకుంది. కార్‌లో వెళ్తున్న వారిపై కొండ చరియలు విరిగి పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు గుజరాత్‌కి చెందిన వాళ్లున్నారని పోలీసులు వెల్లడించారు. కేదార్ నాథ్ యాత్రకు వెళ్లే మార్గంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. అందరి మృతదేహాలను రికవరీ చేసినట్టు చెప్పారు. నలుగురిని గుర్తించినప్పటికీ ఐదో వ్యక్తి గురించి వివరాలు తెలియడం లేదని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. కేదార్‌నాథ్ హైవేపై కొండచరియలు విరిగి పడడం వల్ల రాకపోకలు స్తంభించాయి. దారి పూర్తిగా ధ్వంసమైంది. ఈ క్రమంలోనే కార్ ఆ శిథిలాల్లో చిక్కుకుంది. వారిని బయటకు తీసేందుకు చాలా సమయం పట్టినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కోట్‌ద్వార్‌లో పరిస్థితులు సమీక్షించారు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ కొండ చరియలు విరిగి పడడం వల్ల ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే పలు వంతెనలు ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల రాకపోకలు ఆగిపోయాయి. పలు బ్రిడ్జ్‌లను రిపేర్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులు. త్వరలోనే పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.
VIDEO | Five people, including three pilgrims from Gujarat, died yesterday after being buried under the debris of a landslide on the Kedarnath Yatra route in Uttarakhand's Rudraprayag.
READ: https://t.co/UIONnh8BBI pic.twitter.com/8whiwA9JMU— Press Trust of India (@PTI_News) August 12, 2023
ఇటీవలే రుద్రప్రయాగ్‌లో భారీ కొండ చరియలు విరిగి పడడం వల్ల దాదాపు మూడు షాప్‌లు ధ్వంసమయ్యాయి. 10 మంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు.
"రుద్రప్రయాగ్‌లోని గౌరికుండ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు జిల్లా యంత్రాంగమూ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాధితులకు అండగా ఉంటుంది"
- పుష్కర్ సింగ్ ధామీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
आज मार्ग खोलते वक्त मलबे के अन्दर एक वाहन संख्या UK 07 TB 6315 (स्विफ्ट डिजायर) बहुत ही बुरी तरह से क्षतिग्रस्त दशा में मिला व इसमें सवार रहे 5 व्यक्तियों के शव भी बरामद हुए हैं। #Rescue #UKTrafficUpdate #RudraprayagPolice #UttarakhandPolice pic.twitter.com/VI33FD9ESq
— Rudraprayag Police Uttarakhand (@RudraprayagPol) August 11, 2023
Also Read: Fake News: వదంతులు వ్యాప్తి చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
జమిలి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు టైమ్ లైన్ లేదు-లా కమిషన్ ఛైర్మన్ జస్టిజ్ రితురాజ్ అవస్తీ
Gold-Silver Price 28 September 2023: పసిడిలో భారీ పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
AFCAT 2023: ఏఎఫ్ క్యాట్ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Rajasthan Elections: ముస్లిం ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు
TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
/body>