News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Fake News: వదంతులు వ్యాప్తి చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం

Fake News: ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసిన వాళ్లకు మూడేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం ప్రతిపాదించింది.

FOLLOW US: 
Share:

Fake News: 

వదంతులపై కొరడా..

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. భారతీయ న్యాయ సంహిత బిల్‌ 2023 (Bharatiya Nyaya Sanhita Bill) ప్రవేశపెట్టారు. ఈ బిల్‌ని రివ్యూ చేసేందుకు స్టాండింగ్ కమిటీకి పంపారు. ఇందులో ఓ కీలక ప్రొవిజన్ గురించి వెల్లడించారు షా. వదంతులు వ్యాప్తి చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే వాళ్లకు కఠిన శిక్ష విధించే సెక్షన్ ఈ బిల్‌లో చేర్చినట్టు స్పష్టం చేశారు. సెక్షన్ 195 ప్రకారం...వదంతులు వ్యాప్తి చేసిన వాళ్లకు మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఇందులో ప్రతిపాదనలు చేశారు. దేశ భద్రతను, సమైక్యతను దెబ్బ తీసే విధంగా ఎలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేసినా ఈ శిక్ష వర్తిస్తుంది. మూడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తారు. చాప్టర్ 11లో ఈ సెక్షన్‌ని చేర్చినట్టు అమిత్ షా వెల్లడించారు. వదంతులతో చాలా సందర్భాల్లో భారీ ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లిన సందర్భాలున్నాయి. గతంలో మూక దాడులూ జరిగాయి. అప్పటి నుంచి దీనిపై దృష్టి సారించింది కేంద్రం. ఇప్పుడు ఈ కొత్త బిల్లు ద్వారా నియంత్రించేందుకు సిద్ధమైంది. 

అత్యాచారాలపైనా కొరడా..

మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న క్రమంలోనే మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసిన నేరస్థులకు మరణ శిక్ష విధిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో వెల్లడించారు. దేశ శిక్ష్మాస్మృతిలో (Criminal Law) పలు మార్పులు చేసిన కేంద్రం..మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బిల్లుల ప్రకారం...పలు నేరాలకు శిక్షను మరింత కఠినతరం చేశారు. ఆ నేరం చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టించేలా శిక్ష విధించనున్నట్టు అమిత్‌షా ప్రకటించారు. వివాదాస్పద దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన అమిత్ షా...నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా కొత్త బిల్లుని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. మూకదాడుల విషయంలో నేర తీవ్రతను బట్టి మరణశిక్ష విధిస్తామని తేల్చి చెప్పారు. ఇక ఎన్నికల సమయంలో మద్యంతో పాటు నోట్లు పంచడం సాధారణమైపోయింది. లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు అనధికారికంగా జరుగుతుంటాయి. వీటిని నియంత్రించేందుకూ కేంద్రం కొత్త ప్రొవిజన్ తీసుకురానుంది. ఓటర్లకు డబ్బులు పంచిన వాళ్లకు కనీసం ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తామని వెల్లడించింది. ఇక సామూహిక అత్యాచారాలపైనా కొరడా ఝుళిపించింది. ఈ కేసుల్లో నేరస్థులుగా రుజువైతే 20 ఏళ్ల  జైలుశిక్ష తప్పదు. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధిస్తామని అమిత్‌ షా స్పష్టం చేశారు. 

Published at : 12 Aug 2023 12:11 PM (IST) Tags: Amit Shah Fake news Bharatiya Nyaya Sanhita Bill Spreading Fake News Three Years Jail Criminal Bill

ఇవి కూడా చూడండి

CISF Fireman Answer Key: సీఐఎస్‌ఎఫ్‌ కానిసేబుల్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

CISF Fireman Answer Key: సీఐఎస్‌ఎఫ్‌ కానిసేబుల్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

టాప్ స్టోరీస్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!

Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!