అన్వేషించండి

Uttarakhand : క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఉత్తరాఖండ్‌లో ఎందుకు తరచుగా అకస్మాత్తు వరదలు వస్తుంటాయి?

Uttarakhand : ఒక చిన్న ప్రాంతంలోఅతి భారీ వర్షం కురవడాన్ని క్లౌడ్ బరస్ట్ గా పిలుస్తారు. పది సెంటీమీటర్లు లేదా అంత కంటే ఎక్కువ వర్షపాతం సంభవిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ గా గుర్తిస్తారు.

Uttarakhand : క్లౌడ్ బరస్ట్ అనేది తరచూ ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే ఉత్తరాఖండ్‌లో ఈ క్లౌడ్ బరస్ట్ వార్తలు తరచూ వినిపిస్తాయి. దీని కారణంగా భారీ వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండచరియలు వంటివి విరిగిపడి ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ఉత్తరాఖండ్ వంటి పర్వత ప్రాంతాల్లో అసలు ఈ క్లౌడ్ బరస్ట్ ఎందుకు సంభవిస్తుంది? కారణాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?

ఒక చిన్న ప్రాంతంలో (సుమారు 20-30 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ విస్తీర్ణంలో) అతి భారీ వర్షం కురవడాన్ని క్లౌడ్ బరస్ట్ గా పిలుస్తారు. అంటే ఒక గంటలో ఈ ప్రాంతంలో పది సెంటీమీటర్లు లేదా అంత కంటే ఎక్కువ వర్షపాతం సంభవిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ గా గుర్తిస్తారు. అంటే తక్కువ సమయంలో పెద్ద ఎత్తున వర్షం ఆ ప్రాంతంలో కురుస్తుంది. దీని కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయి. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడతాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటి విపత్తులు సంభవిస్తాయి.

Image

ఉత్తరాఖండ్‌లో ఈ పరిస్థితి తరచూ ఎందుకంటే..?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తరచూ క్లౌడ్ బరస్ట్‌లు జరుగుతుంటాయి. అందుకు ప్రధాన కారణం అక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితులే కారణం. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వతాల నడుమ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో సముద్రం నుంచి వచ్చే తేమతో నిండిన రుతుపవనాలకు సంబంధించిన గాలులకు హిమాలయ పర్వత శ్రేణులు అడ్డుగా ఉంటాయి. ఈ పర్వతాలను రుతుపవన గాలులు దాటలేకపోవడం వల్ల, మేఘాలన్నీ ఒకే చోట చేరతాయి. ఈ క్రమంలో తేమతో కూడిన మేఘాలు అక్కడి చల్లని వాతావరణం కారణంగా ఘనీభవిస్తాయి. ఈ కారణంగా మేఘాలు దట్టంగా పేరుకుని మరింత బరువెక్కడం జరుగుతుంది.

Image

ఇలా ఒకే ప్రాంతంలో తేమ అంతా భారీగా చేరుకుంటుంది. అయితే పర్వత ప్రాంతాల్లో ఉండే అస్థిర వాతావరణం అంటే చల్లని, వేడి గాలులు ఉంటాయి. ఇలా ఒకేసారి చల్లని, వేడి గాలులు ఒకదానితో ఒకటి ఢీకొనే పరిస్థితి ఉంటుంది. దీని కారణంగా వాతావరణం అస్థిరంగా మారుతుంది. దీంతో మేఘాలు ఒక్కసారిగా తమలోని నీటిని కుండపోతగా వర్షం రూపంలో కురిపిస్తాయి. దీంతో క్లౌడ్ బరస్ట్ అనేది ఏర్పడుతుంది. దీంతో పాటు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల వల్ల కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Image

2013లో క్లౌడ్ బరస్ట్ వల్లే కేదార్‌నాథ్ విపత్తు కూడా.

క్లౌడ్ బరస్ట్ ఎలాంటి విలయం సృష్టిస్తుందో చెప్పడానికి 2013లో జరిగిన కేదారనాథ్ విపత్తు ఓ ఉదాహరణ. ఇది ఉత్తరాఖండ్ లో సంభవించిన అతి పెద్ద విపత్తుల్లో ఒకటి. రుతుపవనాల ప్రభావం, వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ అంటే మధ్యధరా సముద్ర ప్రాంతం లో జనించి, తూర్పు వైపునకు ప్రయాణించే తుఫానుల వంటివి. ఇవి ఎక్కువగా చలికాలంలో ప్రభావం చూపిస్తాయి. ఇవి భారత ఉపఖండంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్లే ఉత్తర భారతదేశంలో వాతావరణం తీవ్ర మార్పులకు గురవుతుంది. ఇలా రుతుపవనాలు, వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ కలయిక వల్ల అసాధారణమైన వాతావరణ పరిస్థితి 2013లో కేదరానాథ్ లో ఏర్పడింది. ఈ రెండింటి కలయిక వల్ల హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యధిక తేమతో కూడిన మేఘాలు ఏర్పడి క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీని వల్ల అతి భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగింది.

Image

అయితే ఈ క్లౌడ్ బరస్ట్ వంటి వాటిని ముందుగా గుర్తించేలా చర్యలు తీసుకుని, వరద ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని నిపుణులు చెబుతున్నారు. క్లౌడ్ బరస్ట్ సాధారణంగా పగటిపూట సంభవించినప్పటికీ, రాత్రిపూట కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ విపత్తు వాతావరణ మార్పుల కారణంగా మరింత పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
Omar Abdullah Nidhi Razdan: జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను పెళ్లాడిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. ప్రత్యేక వివాహ చట్టంతో ఒక్కటైన జంట!
జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను పెళ్లాడిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. ప్రత్యేక వివాహ చట్టంతో ఒక్కటైన జంట!
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget