యూపీలోని ఓ స్కూల్‌లో దారుణం, ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన టీచర్ - వైరల్ వీడియో
Viral Video: యూపీలోని ఓ స్కూల్‌లో టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
యూపీలో ఘటన..
యూపీలోని ముజఫర్‌నగర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన ఓ ఘటన సంచలనమవుతోంది. ఓ ముస్లిం విద్యార్థిని ఓ హిందూ విద్యార్థితో కొట్టించింది ఓ మహిళా టీచర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖబర్‌పూర్ గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ వీడియోలో టీచర్ ముస్లింలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. క్లాస్‌లో ఉన్న విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని కొట్టాలని ఆదేశించింది. టీచర్ చెప్పినట్టుగానే విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని చెంపపై కొట్టారు. ఇలా కొడుతూ ఉండగా చైర్‌లో కూర్చున్న టీచర్ "ఇంకా గట్టిగా కొట్టండి" అంటూ ఆర్డర్ వేసింది. ఓ స్టూడెంట్ చెంపమీద కొట్టినా ఆగకుండా...నడుముపైన కొట్టండి అంటూ కుర్చీలో కూర్చుని ఆర్డర్‌లు వేసింది ఆ మహిళా టీచర్. ఈ విషయం తెలిసి ఆ ముస్లిం విద్యార్థి తల్లిదండ్రులు గొడవకు దిగారు. ఇదంతా పెద్ద రచ్చ అవుతుందనుకున్న స్కూల్ యాజమాన్యం వాళ్లతో ఓ డీల్ కుదుర్చుకుంది. అడ్మిషన్ ఫీ తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది. అందుకు అంగీకరించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే...ఈ వీడియో వైరల్ అవడం వల్ల పోలీసుల వరకూ వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్‌ని విచారిస్తున్నారు.
"సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాక కానీ పోలీసులకు ఈ విషయం తెలియలేదు. మ్యాథ్స్ టేబుల్‌ని సరిగ్గా చెప్పలేదన్న కోపంతో ఓ విద్యార్థిని ఇలా దగ్గరుండి మరీ టీచర్ కొట్టించింది. ఈ వీడియోలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలూ వినబడ్డాయి. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ముస్లింల కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టరని, వాళ్ల భవిష్యత్‌ని నాశనం చేస్తారని ఆ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ని ఏర్పాటు చేశారు"
- పోలీసులు
ఈ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్థుల్లోనూ మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారని మండి పడ్డారు. ఇలాంటి ఘటనలకు బీజేపీయే కారణమని విమర్శించారు. మరి కొందరు మాత్రం దీనికి మతంతో సంబంధం లేదని వాదిస్తున్నారు.
मासूम बच्चों के मन में भेदभाव का ज़हर घोलना, स्कूल जैसे पवित्र स्थान को नफ़रत का बाज़ार बनाना - एक शिक्षक देश के लिए इससे बुरा कुछ नहीं कर सकता।
— Rahul Gandhi (@RahulGandhi) August 25, 2023
ये भाजपा का फैलाया वही केरोसिन है जिसने भारत के कोने-कोने में आग लगा रखी है।
बच्चे भारत का भविष्य हैं - उनको नफ़रत नहीं, हम सबको मिल…
-The boy was punished for not doing homework but not for being a MusIim
— Mr Sinha (@MrSinha_) August 25, 2023
-Since the teacher was a handicap, she used to ask other students to slap their fellow classmates
-There was no communal angle in this incident
Listen to the police officer :- pic.twitter.com/u68xvf4jwb