వాళ్ల ఆరాటం అధికారం కోసం, మా పోరాటం సిద్ధాంతాల కోసం - విపక్షాలపై అమిత్ షా విమర్శలు
Amit Shah Speech: పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించారు.
Amit Shah Speech:
పార్లమెంట్‌లో అమిత్‌షా ప్రసంగం
కేంద్రహోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించారు. ఇది కేవలం ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు తీసుకొచ్చిన తీర్మానం అని అసహనం వ్యక్తం చేశారు షా. ఈ దేశ ప్రజలు పూర్తి మెజార్టీతో NDAని ఎన్నుకున్నారన్న ఆయన...దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత ఇంత నమ్మకం సంపాదించుకున్న ప్రభుత్వం మరేదీ లేదని స్పష్టం చేశారు. భారత దేశ చరిత్రలో అత్యుత్తమ ప్రధానిగా మోదీ నిలిచిపోతారని వెల్లడించారు. రోజుకి 17 గంటల పాటు పని చేసే ప్రధాని కేవలం మోదీయే అని ప్రశంసించారు. దేశ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు అమిత్ షా. క్విట్ ఇండియా నినాదంతో సెటైర్లు వేశారు. ఈ అవిశ్వాస తీర్మానం విపక్షాల అసలు రూపాన్ని బయట పెడుతుందని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలేవీ ఉచితాలు కావు అని స్పష్టం చేశారు.
"అవిశ్వాస తీర్మానంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. విపక్షాలకు ఈ తీర్మానం ప్రవేశపెట్టే హక్కు ఉంది. కానీ ఈ నిర్ణయంతో విపక్షాల అసలు రూపమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం 50 విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఈ అవిశ్వాస తీర్మానంపై ప్రజలకు ఎలాంటి విశ్వాసం లేదు. నరేంద్ర మోదీ వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టారు. కేవలం అభివృద్ధి ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తమ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి గతంలో చాలా సార్లు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దేశ చరిత్రలోనే యూపీఏ అత్యంత అవినీతిమయమైన కూటమి. అందుకే ప్రధాని మోదీ అవినీతికి, వారసత్వ రాజకీయాలకు క్విట్ ఇండియా నినాదంతో బదులు చెబుతున్నారు"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
PM Modi govt took some historic decisions and ended dynasties and graft. UPA's character is to protect power but NDA fights to protect principle: Union Home Minister Amit Shah during no-confidence motion debate in Lok Sabha pic.twitter.com/80z5gmNuqJ
— ANI (@ANI) August 9, 2023
కాంగ్రెస్ గరీబీ హఠావో నినాదం కేవలం నినాదానికే పరిమితమైందన్న అమిత్‌షా...పేదల సంక్షేమం కోసం ప్రధాని మోదీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఈ అవిశ్వాసం విపక్షాలకే తప్ప ప్రజలకు కాదని తేల్చి చెప్పారు. పేదలతో రాజకీయాలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించిన అమిత్‌షా రైతుల గురించీ ప్రస్తావించారు. తమ ప్రభుత్వం రైతుల రుణమాఫీపై కన్నా వాళ్లు రుణాలు తీసుకోకుండా చర్యలు తీసుకోవడంపైనే దృష్టి సారించిందని వివరించారు.
"విపక్షాలు జన్‌ధన్ యోజనను ఎందుకు విమర్శిస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓ మాట చెప్పారు. కేంద్రం నుంచి రూ.1 పంపితే...పేదలకు కేవలం రూ.15 పైసలు మాత్రమే చేరుతున్నాయన్నారు. కానీ ఇవాళ కేంద్రం నుంచి పంపే ప్రతిపైసా పేదలకు చేరుతోంది. యూపీఏ అధికారం కాపాడుకోడం కోసం పాకులాడితే...ఎన్డీఏది సిద్ధాంతాలను కాపాడుకునేందుకు పోరాడుతోంది"- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
#WATCH | It has to be understood why they (UPA) were opposing Jan Dhan Yojana? Former PM Rajiv Gandhi had said that when Re 1 is sent from the Centre to the poor, only 15 paise reaches the beneficiary....But today, today entire amount reaches the poor: Union Home Minister Amit… pic.twitter.com/fk02pXbSkW
— ANI (@ANI) August 9, 2023
Also Read: దూకుడు పెంచిన రాహుల్ గాంధీ, పార్లమెంట్‌లో పవర్ఫుల్ స్పీచ్ - ఆ వ్యాఖ్యలతో దుమారం