(Source: ECI/ABP News/ABP Majha)
Presidential Election 2022 : ఎన్డీఏ అభ్యర్థికే శివసేన మద్దతు - రాష్ట్రపతి ఎన్నికలపై ఉద్దవ్ ధాకరే కీలక నిర్ణయం !
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు ప్రకటించింది. ఎంపీలు అత్యధికులు ఆమెకే మద్దతివ్వాలని కోరడంతో ఉద్దవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Presidential Election 2022 : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మరో పార్టీ మద్దతు పలికారు. తాము ద్రౌపది ముర్ముకే సపోర్ట్ చేయాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. 19 మంది ఎంపీల్లో 16 మంది ఉద్దవ్ థాక్రే సమావేశానికి హాజరయ్యారు. ఎక్కువ మంది ఎంపీలు ముర్ముకు మద్దతు ప్రకటించాలని కోరినట్లు తెలుస్తోంది. ద్రౌపది ముర్ముకు మద్దతిస్తే.. బీజేపీకి ఇచ్చినట్లు కాదని శివసేన చెబుతోంది. గతంలో ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతిచ్చామన్నారు. యశ్వంత్ సిన్హాపై తమకు మంచి అభిప్రాయమే ఉందని సంజయ్ రౌత్ తెలిపారు.
Shiv Sena will support Droupadi Murmu for Presidential elections: Shiv Sena chief Uddhav Thackeray pic.twitter.com/Y6LrGWdlVc
— ANI (@ANI) July 12, 2022
సీఎంకు చల్లారిపోయిన ఛాయ్ ఇచ్చినందుకు అధికారికి షోకాజ్ నోటీస్!
గిరిజన మహిళ రాష్ట్రపతి కావడం సంతోషంగా ఉందని ఉద్దవ్ థాక్రే ప్రకటించారు. " శివసేన ఎంపీలు నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు, కానీ వారు సూచించారు. వారి సూచనను వింటూ, రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వబోతున్నాం" అని ఉద్దవ్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన.. రాజకీయాలు పట్టించుకోదని, గతంలో మాదిరే ఇప్పుడు గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చి తీరుతుందని శివసేన ఎంపీ ఒకరు ముందుగానే ప్రకటించారు.
సూపర్ మ్యాన్‌ని చూసి ఉంటారు.. సూపర్ మూన్ చూస్తారా ? బుధవారమే ముహుర్తం !
విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమయంలో మల్లగుల్లాలు పడుతుంటే.. పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంది శివసేన. అందుకే కీలక సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఎవరికి మద్దతు ఇస్తుందా? అనే ఆసక్తికర చర్చ నడుస్తూ వచ్చింది. ప్రతిపక్షం బలంగా ఉండాలన్నది మా ఉద్దేశం. . ఒత్తిడిలో శివసేన ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. శివసేన ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
94 ఏళ్ల వయసులో దేశానికి రికార్డులు, పతకాలు ! ఈ బామ్మకు సెల్యూట్ చేయాల్సిందే
కాగా జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ముర్ముకు పోటీగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. జూలై 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.