Vijay: సీఎం అభ్యర్థిగా విజయ్- 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ- టీవీకే కీలక తీర్మానం
Tamilaga Vetri Kalagam : సీఎం అభ్యర్థిగా విజయ్ నేతృత్వంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని టీవీకే తీర్మానించింది.

Vijay: తమిళనాడు(Tamil Nadu)లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(tamilaga vetri kalagam) టీవీకే నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం సమావేశమైన పార్టీ కార్యవర్గం పలు తీర్మానాలు చేసింది. బీజేపీ విధానాలపై కూడా విజయ్ తీవ్ర విమర్శలు చేసినట్టు సమాచారం.
చెన్నైలోని టీవీకే కార్యాలయంలో శుక్రవారం కార్యవర్గం సమామైంది. 2026 నాటికి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించిన పార్టీ కార్యవర్గం సీఎం అభ్యర్థిగా విజయ్‌ను ఖరారు చేశారు. పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు వచ్చే నెలల విస్తృత పార్టీ స్థాయి సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. గ్రామాల్లో సభలు పెట్టాలని తీర్మానించారు. ప్రజలకు విజయ్ మరింత దగ్గరయ్యేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
మిగతా సినీ పొలిటీషియన్ లా నేను డబ్బులకు అమ్ముడుపోయి, మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ తో పొత్తు పెట్టుకొను
— Harvey Specter (@godeaterr91) July 4, 2025
~~~ విజయ్
pic.twitter.com/w5xG33Owfc
తమిళనాడులో బీజేపీ విధ్వంసకరమైన విధానాలు చేపడుతోందని టీవీకే విమర్శించింది. భాష, మతం పేరుతో చేస్తున్న రాజకీయం ప్రమాదకరమని అభిప్రాయపడింది. ఇంగ్లీష్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను కూడా టీవీకే తప్పుపట్టింది. హిందీ, సంస్కృత భాషను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితిలో టీవీకే అంగీకరించేది లేదన్నారు. ఎలక్టోరల్ రివిజన్‌లో కూడా కుట్ర దాగి ఉందని టీవీకే ఆరోపించారు.





















