అన్వేషించండి

Tomato Price: కిలో టమాటా రూ.37 మాత్రమే, తగ్గుతున్న ధరలు - ప్రముఖ నగరాల్లో రేట్లు ఇలా

Tomato Price:  దేశ వ్యాప్తంగా టమాటా ధరలు దిగొస్తున్నాయి. రెండు నెలలుగా వినియోగదారులకు చుక్కలు చూపిస్తూ వచ్చిన టమాటాలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి.

Tomato Price:  దేశ వ్యాప్తంగా టమాటా ధరలు దిగొస్తున్నాయి. రెండు నెలలుగా వినియోగదారులకు చుక్కలు చూపిస్తూ వచ్చిన టమాటాలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా టమాటాల ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా తగ్గాయి. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ డేటా ప్రకారం రెండు వారాల్లో టమాటా ధరలలో రూ.90 తగ్గుదల కనిపించింది. 

రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా టమాటాల ధరల తగ్గుదలలో క్షీణత ఉంది. గతంలో పెరిగిన టమాటా ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నేపాల్ నుంచి టమాటాలు దిగుమతి చేసుకుంటోంది. అలాగే ఏపీలోని మదనపల్లె, కర్ణాటకలోని కోలార్ నుంచి పెద్ద ఎత్తున టమాటాలు కొనుగోలు చేసి తక్కువ ధరకు రాయితీపై విక్రయిస్తోంది. 

ఈ నేపథ్యంలో పరిస్థితిలో ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల వెబ్‌సైట్‌లో కూడా టమోటాల ధర తగ్గుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు వారాల్లో టమాటా ధరలలో రూ.90 తగ్గుదల కనిపించింది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా. ఇది కాకుండా దేశ సగటు ధరలలో కూడా క్షీణత ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ఎంత పెరిగాయో ఓ సారి చూద్దాం.

ఢిల్లీలో కిలో రూ.107
వినియోగదారుల వ్యవహారాల వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. ఆగస్టు 1న దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర రూ.177 ఉండగా, ఆగస్టు 15 నాటికి కిలో రూ.107కి పడిపోయింది. దేశంలో సగటు ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఆగస్టు 1న కిలో టమాటా సగటు ధర రూ.132.57 ఉండగా, ఆగస్టు 15 నాటికి కిలో రూ.107.87కి చేరింది. సగటున టమాట ధరలు రూ.25 తగ్గాయి.

అక్కడ కిలో రూ.37 మాత్రమే
దేశంలోనే అత్యంత చౌకైన టమోటా సోనిత్‌పూర్ తేజ్‌పూర్‌లో ఉంది. రెండు వారాల క్రితం ఆగస్టు 1న ఇక్కడ టమాటా కిలో రూ.37 పలికింది. ఈ రోజు కూడా ఇక్కడ టమాట ధరలు అదే స్థాయిలో ఉన్నాయి. గరిష్ఠ ధర కిలో రూ.200 దిగువకు వచ్చింది. ఆగస్టు 1న మధ్యప్రదేశ్‌లోని బింద్‌లో కిలో రూ.240 పలికింది. ఆగస్టు 15న మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో కిలో రూ.198కి తగ్గింది. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

అమృత్‌సర్‌, హరిద్వార్‌లో పెరిగిన రేట్లు
అమృత్‌సర్‌లో ఆగస్టు 1న రూ.120 ఉన్న టమాటా ఇప్పుడు రూ.152కి పెరిగాయి. అలాగే హరిద్వార్‌లో ఆగస్టు 1న రూ.110 ఉన్న టమోటా ధర ఇప్పుడు కిలో రూ.180కి పెరిగింది. ముంబైలో ఆగస్టు 1న రూ.155 ఉండగా స్వల్పంగా పెరిగి ఇప్పుడు కిలో రూ.158కి చేరింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఆగస్టు 1న టమాటా ధర రూ.218 ఉండగా రూ.68కి పడిపోయింది. ఆగస్టు 1న చండీగఢ్‌లో కిలో ధర రూ.115 ఉండగా, ప్రస్తుతం కిలో రూ.90కి చేరింది. 

దేశ వ్యాప్తంగా తగ్గిన ధరలు
బెంగళూరులో ఆగస్టు 1న కిలో రూ.97 ఉండగా ఇప్పుడు రూ.80కి తగ్గాయి. శివమొగ్గలో ఆగస్టు 1న కిలో టమాటా ధర రూ.115 ఉండగా, తాజాగా కిలో రూ.60కి పడిపోయింది. కర్ణాటకలోని కోలార్‌లో కిలో టమాటా ధర రూ.107 నుంచి రూ.67కి చేరింది. చెన్నైలో ఆగస్టు 1న రూ.163 ఉండగా, కిలో రూ.72కి తగ్గింది. రెండు వారాల్లో సగానికి పడిపోయాయి. ఇక హైదరాబాద్‌లో రూ.120 ఉండగా, ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 మధ్య పలుకుతోంది. లక్నోలో రూ.150 నుంచి రూ.120కి తగ్గాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget