అన్వేషించండి

Year Ender 2022: ఈ ఏడాది ఎక్కువ మంది దర్శించుకున్న ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి - తిరుపతి స్థానం ఏంతంటే !

Tirumala News: భక్తులు వెళ్లేందుకు ఆసక్తి చూపించిన, దర్శించిన తొలి దర్శనీయ, పర్యాటక ప్రాంతంగా వారణాసి నిలిచింది. ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టులో తిరుపతి రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

Oyo Cultural Travel 2022 Roundup Report: భారతదేశం ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. దేశంలో దర్శనీయ పుణ్యక్షేత్రాలలో ఎక్కువ మంది చెప్పే పేరు  ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశీ). ఈ సంవత్సరం (2022లో) ప్రజలకు అత్యంత ఇష్టమైన తీర్థయాత్ర గమ్యస్థానంగా వారణాసి నిలిచింది. ఓయో కల్చరల్ ట్రావెల్ 2022 రౌండప్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. తెలుగు వారి కలియుగదైవం వెంకటేశ్వరుడి నిలయం తిరుమల తిరుపతి సైతం భక్తుల గమ్యస్థానంగా నిలిచింది.

రెండో స్థానంలో తిరుపతి 
దేశ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భక్తులు వెళ్లేందుకు ఆసక్తి చూపించిన, దర్శించిన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా వారణాసి నిలిచింది. ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టులో తిరుపతి రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఆ తరువాత ఒడిశాలోని పూరీ, పంజాబ్ లోని అమృత్‌సర్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లను కూడా అత్యధిక ప్రజలు తమకు ఇష్టమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా టాప్ 5 స్థానాల్లో నిలిచాయని ఓయో నివేదికలో పేర్కొన్నారు. 

పైన పేర్కొన్న నగరాలతో పాటు మహారాష్ట్రలోని షిర్డీ, ఉత్తరాఖండ్ లోని రిషికేశ్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, మహాబలేశ్వర్ (మహారాష్ట్ర)లతో పాటు  తమిళనాడులోని మధురై కూడా భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలలో నిలిచాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయా ఆధ్యాత్మి పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

వారణాసి హిందువులు మరియు బౌద్ధులు ఇద్దరికీ ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి. మొత్తం భారతదేశంలోని మతపరమైన పర్యాటక ప్రదేశాల కంటే దీని ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ఒక ప్రదేశాన్ని మళ్లీ సందర్శించడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే తీర్థయాత్రల విషయానికి వస్తే ఇక్కడికి ఎన్నిసార్లయినా రావడానికి సిద్ధంగా ఉంటారు. పాదయాత్రకు వచ్చే జనంలో వృద్ధులే కాదు, యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు గొప్ప సాంస్కృతిక ప్రదేశాలు, తెలియని ప్రదేశాలు (అవి గతంలో ఎన్నడూ లేనివి), రాజ భవనాలు మరియు మతపరమైన ప్రదేశాలను అన్వేషించడానికి ఉత్సాహంగా ఉన్నారు.

అగ్ర స్థానంలో నిలిచిన వారణాసి
ఈ సంవత్సరం పండుగ సీజన్‌కు ముందు, గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ OYO దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక, పర్యాటక ప్రయాణం, దర్శనీయ స్థలాల వివరాలు సేకరించింది. OYOలో రూమ్ బుకింగ్ డేటా ప్రకారం, ఆగస్టు నెలలో తీర్థయాత్రలు అధికంగా చేశారు. దేశంలో ఆధ్యాత్మిక ప్రాంతాలలో 2022 ఆగస్ట్ నుంచి అక్టోబర్ నెలల మధ్య OYO రూమ్ బుకింగ్ కు అధిక డిమాండ్ ఉంది. ఆధ్యాత్మిక ప్రాంతాలు, దర్శనీయ స్థలాల జాబితాలో వారణాసి దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆగస్ట్ 13న ఇక్కడ అత్యధికంగా రద్దీ కనిపించినట్లు ఓయో రిపోర్ట్ చేసింది.

షిర్డీకి సైతం పోటెత్తిన భక్తులు, పర్యాటకులు
గదుల బుకింగ్స్‌లో యాత్రా స్థలాల్లో వారణాసి అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది కూడా భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. గతంతో పోల్చితే శాతం పరంగా చూస్తే షిర్డీ (483 శాతం) తొలి స్థానంలో ఉండగా.. తిరుపతి (233 శాతం), పూరి (117 శాతం)తో వారణాసి తరువాత డిమాండ్ బుకింగ్స్ జరిగిన ప్రాంతాలు. అదే సమయంలో అమృత్‌సర్, హరిద్వార్‌లలో కూడా గదుల బుకింగ్‌లలో భారీ పెరుగుదల కనిపించింది. వీటితో పాటు, మథుర, మహాబలేశ్వర్,  మదురై లను అధిక సంఖ్యలో భక్తులు, పర్యాటకులు సందర్శించారు. కరోనా వ్యాప్తి లాంటి భయాలు తొలగిపోవడం, కోవిడ్19 కేసులు తగ్గడంతో ఈ ఏడాది నవంబర్ వరకు భారీగా బుకింగ్స్ జరిగాయని ఓయో ఈ ఏడాది రిపోర్టులో స్పష్టం చేసింది.


మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
Embed widget