ISRO News: ఇస్రో మిషన్స్ వెనుక అనౌన్సర్ తెలుసా? అనారోగ్యంతో కన్నుమూత - విషాదంలో ఉద్యోగులు
ఇస్రో చేపట్టే ప్రయోగాలను గంభీరమైన గొంతుతో వినిపించిన వాలర్ మతి హార్ట్అటాక్ తో కన్నుమూశారు.
ఇస్రో చేపట్టే ప్రయోగాలను గంభీరమైన గొంతుతో వినిపించిన వాలర్ మతి హార్ట్అటాక్ తో కన్నుమూశారు. ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాలకు ఆమె స్వరం అందించారు. వాలర్ మతి వయసు 50 ఏళ్లు. గుండెపోటు రావడంతో... కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చంద్రయాన్-3, సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. వాలర్మతి మృతితో ఇస్రోలో విషాదం ఛాయలు అలుముకున్నాయ్.
వాలర్ మతి చివరిసారిగా జులై 14న ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3కి లైవ్ స్ట్రీమింగ్ కు వాయిస్ ఇచ్చారు. ఇస్రో ప్రయోగాల సమయంలో వినిపించే వాలర్ మతి గొంతు దేశ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయింది. ఆమె మృతి పట్ల ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌తో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వాలర్మతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1959లో తమిళనాడులోని అరియలూరులో వాలర్ మతి జన్మించారు. 1984లో ఇస్రోలో సైంటిస్ట్ గా చేరారు. చివరిసారిగా చంద్రయాన్-3 మిషన్ కు వాలర్ మతి కౌంట్ డౌన్ చెప్పారు. మీకు మరణం లేదు తల్లీ...రాకెట్ కౌంట్ డౌన్ సమయంలో వినిపించే గొంతు దేశ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో...ఆమె సేవలను కొనియాడుతున్నారు. మీ సేవలు మరిచిపోలేనివంటూ కొనియాడుతున్నారు.