By: ABP Desam | Updated at : 10 Nov 2021 08:35 PM (IST)
Edited By: Sai Anand Madasu
తమిళనాడులో భారీ వర్షాలు
తమిళనాడులో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ ,డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి రామచంద్రన్ వెల్లడించారు. 11 ఎన్డీఆర్ఎఫ్, 07 ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. చెన్నై నగరం నీటమునిగింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి.
కుంభకోణంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో పైకప్పు కూలడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. బుధవారం కుంభకోణంలో కురిసిన భారీ వర్షానికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.
రానున్న 24 గంటల్లో చెన్నైలో మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ఉత్తర తమిళనాడు వైపు కదులుతున్నందున, రాజధాని నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. చెన్నై సహా 20 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలో సగటు కంటే 42% వర్షపాతం నమోదైంది. బుధ, గురువారాల్లో నగరంలో 150 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
వర్షాలు కురుస్తున్నందున.. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలి. తగినన్ని ఆహారం మరియు నీటిని సిద్ధంగా ఉంచుకోండి. కమ్యూనికేషన్ కోసం అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయండి. ఆహారం మరియు జనరేటర్ సెట్లను (విద్యుత్ సరఫరా కోసం) పంపిణీ చేసేందుకు, మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి సిద్దంగా ఉన్నాం.
- గ్రేటర్ చెన్నై కమిషనర్, గగన్‌దీప్ సింగ్
ప్రస్తుతం 53 బోట్లను సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 600 మోటారు పంపులను నీటని తోడేందుకు ఉపయోగిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 450 సైరన్ టవర్లను ఏర్పాటు చేసింది. భారీ వర్షం కారణంగా ఇళ్లు మరియు వీధులు జలమయం అయితే అత్యవసర పరిస్థితుల్లో నగరవాసులు ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 1,700 మందిని సహాయక శిబిరాలకు తరలించారు.
Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !
Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!
MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!
Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే
NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
Pranitha Subhash: అమ్మ కావడమే వరం, బేబీ బంప్‌తో ప్రణీత ఫోటోషూట్