TVK Vijay Meeting stampede: తొక్కిసలాట పేషెంట్ల అడ్మిషన్లపై ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు
Vijay TVK meeting stampede | కరూర్ లో టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాట విషాదాన్ని నింపింది. పేషెంట్ల అడ్మిషన్లపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Actor Vijay TVK Meeting Stampede | కరూర్, తమిళనాడు: సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలతో తమిళనాడు మాజీ మంత్రి, డిఎంకె నాయకుడు వి సెంథిల్ బాలాజీ కరూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు వెళ్లారు. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ కరూర్ లో నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాటలో స్పృహ కోల్పోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని సెంథిల్ బాలాజీ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లతో మాట్లాడిన సెంధిల్ బాలాజీ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ, "నమక్కల్, సేలం జిల్లాల నుండి వైద్యులను చికిత్స అందించేందుకు కరూర్‌కు పిలిచాం, వారు కూడా దారిలో ఉన్నారు. తొక్కిసలాట కారణంగా బాధితులను అడ్మిట్ చేసుకునేందుకు హాస్పిటల్స్ ఎలాంటి నగదు వసూలు చేయవద్దని మేము ప్రైవేట్ ఆసుపత్రికి సూచించాం. సీఎం స్టాలిన్ ఆదేశం ప్రకారం ప్రభుత్వం ఆ ఖర్చులను భరిస్తుంది. కనుక మరణాల రేటు మరింత పెరగకుండా హాస్పిటల్స్ బాధ్యతగా వ్యవహరించాలి’ అన్నారు.
#WATCH | Karur stampede: Former Tamil Nadu Minister and DMK leader V Senthil Balaji arrived at Government Medical College and Hospital, Karur
— ANI (@ANI) September 27, 2025
He said, "Till now, 31 people have died in the stampede and 58 people have been admitted. After the stampede incident, the CM immediately… pic.twitter.com/kxMmMEGLeS
‘ఇప్పటివరకు టీవీకే అధ్యక్షుడు విజయ్ సభలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. మరో 58 మంది చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట సంఘటన తర్వాత, ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీని, నన్ను ఆసుపత్రికి త్వరగా బాధితుల్ని తరలించాలని ఆదేశించారు. అదనపు వైద్యులను పిలిపించి సరైన చికిత్స అందించాలని సీఎం స్టాలిన్ సూచించారు. రేపు సీఎం స్టాలిన్ స్వయంగా ఇక్కడికి రానున్నారు. ప్రస్తుతానికి 46 మంది ప్రైవేట్ ఆసుపత్రిలో, మరో 12 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు.
Karur, Tamil Nadu: Former Tamil Nadu Minister and DMK leader V Senthil Balaji says, "Doctors from Namakkal and Selam districts called to Karur for treatment, and they are also on the way. We have advised the private hospital not to charge for the admissions due to the stampede,… https://t.co/0NBZLZYKaW pic.twitter.com/VQGaw0RIEC
— ANI (@ANI) September 27, 2025
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
టీవీకే అధినేత విజయ్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాట విషాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో దురదృష్టకర ఘటన జరగడం చాలా బాధాకరం. తమ కుటుంబసభ్యులు, ఇష్టమైన వారిని కోల్పోయిన కుటుంబాల గురించే ఆలోచిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
The unfortunate incident during a political rally in Karur, Tamil Nadu, is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones. Wishing strength to them in this difficult time. Praying for a swift recovery to all those injured.
— Narendra Modi (@narendramodi) September 27, 2025





















