By: Ram Manohar | Updated at : 30 Sep 2023 03:22 PM (IST)
బీజేపీ కారణంగా ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వచ్చామని AIDMK నేత వెల్లడించారు. (Image Credits: ANI)
AIDMK Leaves NDA:
ఎన్‌డీఏ కూటమికి గుడ్‌బై..
తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల జరిగిన కీలక పరిణామం ఏదైనా ఉందంటే...అది AIDMK బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి నుంచి బయటకు రావడం. దాదాపు నాలుగేళ్లుగా అదే కూటమిలో ఉంటున్న అన్నా డీఎమ్‌కే ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకుంది. పైగా లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల బీజేపీకి గట్టి దెబ్బ తగిలినట్టైంది. మొదటి నుంచి ద్రవిడ పార్టీలే ఆ రాష్ట్రాన్ని ఏలుతున్నాయి. అక్కడి పోటీని తట్టుకునేందుకు అన్నా డీఎమ్‌కేతో మైత్రి కుదుర్చుకుంది. కొంతైనా క్యాడర్ పెంచుకోవాలని ప్రయత్నించింది. కానీ...అది సాధ్యపడలేదు. ఇప్పుడు అన్నా డీఎమ్‌కే పార్టీ ఎన్‌డీఏ నుంచి బయటకు రావడం మరింత షాక్‌కి గురి చేసింది. అయితే...కూటమి నుంచి వైదొలగడానికి గల కారణాలపై రకరకాల వాదనలు వినిపించాయి. ఈ పరిణామాలపై AIDMK నేత, మాజీ మంత్రి కేసీ కరుప్పణ్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైని అధ్యక్షుడిగా అంగీకరించాలని ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే కూటమి నుంచి బయటకు వచ్చేశామని వెల్లడించారు. అన్నామలైపై చాలా రోజులుగా గుర్రుగా ఉంది అన్నా డీఎమ్‌కే. ఓ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి జయలలితను విమర్శించారు అన్నామలై. దీనిపై AIDMK అసహనం వ్యక్తం చేసింది. తమ నేతపైనే విమర్శలు చేసిన తరవాత కూటమిలో ఉండాల్సిన అవసరం ఏముందని, అందుకే బయటకు వచ్చేశామని కరుప్పణ్ణన్ తెలిపారు. అంతే కాదు. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలైని ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ అంగీకరించాలని బీజేపీ ఒత్తిడి చేసిందని అసహనం వ్యక్తం చేశారు.
AIDMK జనరల్ సెక్రటరీ పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించగా...అందుకు బీజేపీ చీఫ్ అన్నామలై ఒప్పుకోలేదు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
"మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శలు చేసిన వ్యక్తిని ఎలా సహిస్తాం..? అందుకే మా పార్టీ హైకమాండ్ NDA నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నాం. అన్నామలైని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. అందుకు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది నచ్చకే బయటకు రావాల్సి వచ్చింది"
- కేసీ కరుప్పణ్ణన్, AIDMK నేత
Erode, Tamil Nadu: AIADMK Former Minister KC Karuppannan said, "The AIADMK broke the alliance with BJP because they (BJP) were insisting on accepting Tamil Nadu BJP leader K Annamalai as the chief ministerial candidate in the 2026 assembly elections. K Annamalai criticised the… pic.twitter.com/KVPuTCkwLK
— ANI (@ANI) September 30, 2023
ప్రత్యేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నట్టు AIDMK వెల్లడించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలతోనే ఈ కొత్త కూటమితో బరిలోకి దిగనున్నట్టు స్పష్టం చేసింది. బీజేపీతో తమ పొత్తు ఇకపై ఉండదని తేల్చి చెప్పింది. ఇన్నాళ్లూ అధికార పక్షం DMKకి ఇదో అస్త్రంగా ఉండేది. AIDMK బీజేపీతో ఉండడంపై తీవ్ర విమర్శలు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్‌తో పాటు ఉదయనిధి స్టాలిన్ కూడా అన్నా డీఎమ్‌కే పార్టీపై ఇటీవల మండిపడ్డారు. సరిగ్గా మూడు రోజుల తరవాత AIDMK NDA నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించింది.
Also Read: భార్యపై అనుమానంతో దారుణం, చేతి వేళ్లు జుట్టు కత్తిరించి తల నరికేసి హత్య
Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
MBBS: ఎంబీబీఎస్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పరీక్షలు రాసేందుకు మరో అవకాశం
కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్, డిగ్రీ అర్హతతో 444 ఉద్యోగాల భర్తీ
Article 370: అసలేంటీ 'ఆర్టికల్ 370' - ఎందుకు రద్దు చేశారు.?, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏం జరిగిందంటే.?
Madhya Pradesh CM: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ నియామకం, ఉత్కంఠకు తెర
TSPSC Chairman Resigns: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
/body>