భారత్ హిందువుల దేశం కాదు, ఇది అందరిదీ - RSS చీఫ్‌పై ఎస్పీ నేత ఫైర్
Swami Prasad Maurya: భారత్ హిందూ దేశం అన్న మోహన్ భగవత్ కామెంట్స్‌పై ప్రసాద్ మౌర్య మండి పడ్డారు.
Swami Prasad Maurya:
భారత్ హిందూ దేశం కాదు..
భారత్ హిందూ దేశమని, ఇక్కడ ఉండే వాళ్లందరూ హిందువులే అని RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ (SP) నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్రంగా స్పందించారు. భారత్ హిందూ దేశమే కాదని తేల్చి చెప్పారు. ఇది అందరి దేశమని, ఒక మతానికి ఆపాదించడమేంటని ప్రశ్నించారు. దేశ రాజ్యాగం లౌకికవాదం ఆధారంగానే రూపొందిందని వెల్లడించారు.
"భారత్ ఎప్పటికీ హిందూ దేశం కాదు. ఇక్కడ నివసించే అందరిది. లౌకిక వాదం ఆధారంగానే మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ దేశంలో ఉండే వాళ్లందరూ భారతీయులే. అన్ని మతాలు, విశ్వాసాలు, సంస్కృతులు, వర్గాలకు రాజ్యాంగం ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చింది. కేవలం హిందువులకు మాత్రమే ఆపాదించడం సరికాదు"
- స్వామి ప్రసాద్ మౌర్య, ఎస్పీ నేత
भारत हिंदू राष्ट्र नही है, पूर्व में भी कभी हिंदू राष्ट्र नहीं था। भारत अपने आप में एक संप्रभु राष्ट्र है। हमारा संविधान पंथ निरपेक्ष राष्ट्र की अवधारणा पर आधारित है। भारत के सभी लोग भारतीय हैं। सभी धर्मों, पंथो, सम्प्रदायों व संस्कृतियों का प्रतिनिधित्व हमारा भारतीय संविधान करता… pic.twitter.com/rBhGNTRPPC
— Swami Prasad Maurya (@SwamiPMaurya) September 2, 2023
ఇటీవల నాగ్‌పూర్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని ప్రజలంతా హిందువులే అని తేల్చి చెప్పారు. ఇది హిందూ దేశమని ప్రకటించారు.
"హిందుస్థాన్ హిందూ దేశం. భారతీయులందరూ హిందువులే. హిందువులు అంటేనే భారతీయులు. ఇవాళ భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతిని అనుసరిస్తున్న వాళ్లే. వాళ్ల పూర్వీకులంతా హిందువులే. ఇప్పటికే ఈ విషయం కొంత మందికి అర్థమైంది. కొంత మంది అర్థమైనా కూడా అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నారు. స్వార్థం కోసం ఈ నిజాన్ని అంగీకరించడం లేదు"
- మోహన్ భగవత్, RSS చీఫ్
మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇటీవలే స్వామి ప్రసాద్ మౌర్య హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో రాంచరిత్ మానస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న మౌర్య..ఇప్పుడు మరోసారి నోరు జారారు. బ్రాహ్మణులు, హిందూ మతంపై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. హిందూయిజం అనేదే లేదని అదంతా ఓ బూటకమని తేల్చి చెప్పారు. ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన ఓ పెద్ద నోట్ రాశారు. అందులో అసలు హిందూయిజం అనే మతమే లేదని స్పష్టం చేశారు. కేవలం దళితులపై కుట్ర చేసేందుకే ఓ మతం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా హిందూ మతం ఉండి ఉంటే...వెనకబడిన వర్గాలకూ మేలు జరిగి ఉండేదని అన్నారు.
"బ్రాహ్మణవాద మూలాలు చాలా లోతుగా మన సమాజంలో పాతుకుపోయాయి. సంఘంలో అసమానతలకూ ఈ బ్రాహ్మణవాదమే కారణం. హిందూ అనే మతమే మన దేశంలో లేదు. అదంతా ఓ బూటకం. కేవలం దళితులను, గిరిజనులను, వెనక బడిన వర్గాలపై చేసిన కుట్ర ఇది. బ్రాహ్మణ కులాన్నే హిందూ మతంగా ప్రచారం చేసుకున్నారు. నిజంగా హిందూ మతం ఉండి ఉంటే దళితులకు సముచిత గౌరవం దక్కేది. వెనక బడిన వర్గాలూ అభివృద్ధి చెందేవి
- స్వామి ప్రసాద్ మౌర్య, సమాజ్‌వాదీ పార్టీ నేత
Also Read: Modi on Aditya L1: ఆదిత్య L1 సక్సెస్‌పై ప్రధాని మోదీ హర్షం, ఇస్రోకు అభినందనలు