జ్ఞానవాపి మసీదు కమిటీకి చుక్కెదురు, సర్వే ఆపాలన్న పిటిషన్‌ని కొట్టేసిన సుప్రీంకోర్టు
Gyanvapi ASI survey: సర్వే ఆపాలన్న మసీదు కమిటీ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేసింది.
Gyanvapi ASI survey:
ASI సర్వే
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ASI సర్వే ఆపేయాలని మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అలహాబాద్ హైకోర్టు సర్వేకి అనుమతినిస్తూ తీర్పునివ్వడాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ పిటిషన్ వేసింది. ఈ కమిటీ తరపున అడ్వకేట్ హుజేఫా అహ్మదీ వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సర్వే జరుగుతున్న దశలో జోక్యం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది.
"ఇప్పటికే ఈ విషయంలో స్పష్టమైన తీర్పు వచ్చేసింది. ఈ దశలో ఎందుకు జోక్యం చేసుకోవాలి..? మసీదులో తవ్వకాలపై ఇప్పటికే చర్చ జరిగింది. దానిపై ASI టీమ్ స్పష్టంగా సమాధానమిచ్చింది. తవ్వకాలు జరపకుండానే సర్వే చేపడతామని చెప్పింది. మేం కూడా అదే సూచించాం. ఈ సర్వే పూర్తైన తరవాత ఆర్కియాలజీ అధికారులు ఓ రిపోర్ట్ ఇస్తారు"
- సుప్రీంకోర్టు
అంతకు ముందు అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ తన వాదన వినిపించారు. మసీదులో కొన్ని గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అవేంటో తెలుసుకోవాల్సిన అవసరముందని అన్నారు.
"మసీదులో ఆలయానికి సంబంధించిన కొన్ని గుర్తులున్నాయి. వాటిని సైంటిఫిక్‌గా స్టడీ చేసిన తరవాతే నిర్ధరించుకోగలం. ఈ సర్వే చేసే క్రమంలో మేం పారదర్శకత పాటిస్తాం. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే లైవ్ స్ట్రీమింగ్ చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం"
- మాధవి దివాన్, అడిషనల్ సొలిసిటర్ జనరల్
#WATCH | Varanasi, Uttar Pradesh: A team of the Archaeological Survey of India (ASI) arrives at the Gyanvapi mosque complex to conduct a scientific survey of the complex pic.twitter.com/gvkyH4f62L
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 4, 2023
మరోవైపు వారణాసి కోర్టులోనే మరో పిటిషన్‌పై విచారణ జరిగింది. మసీదులో త్రిశూలం, స్వస్తిక్ గుర్తులు కనిపించాయని పిటిషన్ దాఖలైంది. ఆ గుర్తులను చెరిపేయకుండా కాపాడాలని పిటిషన్‌లో కోరారు.
#WATCH | Varanasi, UP: On the ASI survey of the Gyanvapi mosque complex, advocate Sohan Lal Arya says, "According to the old list, eight people were there...In the new list that was released by the DM...My name was also there including others but it did not include the names of… pic.twitter.com/l85KGlIyVg
— ANI (@ANI) August 4, 2023
మసీదు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది మొహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి అల్లర్లు జరగకుండా నిఘా పెడుతున్నారు. ఇద్దరు IPSలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఆరుగురు డిప్యుటీ ఎస్పీలతో పాటు 10 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు, 200 మంది సిబ్బంది సర్వేని పర్యవేక్షిస్తున్నారు. అయితే...ASI టీమ్‌తో పాటు మరో 16 మందికి లోపలకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు అధికారులు. వీరిలో 9 మంది ముస్లింలు కాగా...7గురు హిందువులు. కానీ...ముస్లింలు లోపలకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఏడుగురు హిందువులు మాత్రమే లోపలకు వెళ్లారు. దాదాపు రెండు వారాల పాటు ఈ సర్వే కొనసాగనుంది.
Also Read: Modi Surname Case: సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ ఆసక్తికర ట్వీట్, బీజేపీకి సెటైర్ వేశారా?