By: Ram Manohar | Updated at : 04 Aug 2023 05:07 PM (IST)
సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
Modi Surname Case:
రాహుల్ ట్వీట్..
పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి ఊరటనిచ్చింది సుప్రీంకోర్టు. అంతకు ముందు సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చగా...ఈ తీర్పుపై స్టే విధించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. సత్యమే గెలిచింది అంటూ రాహుల్‌కి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ తీర్పు రాహుల్ గాంధీ స్పందించారు. ఆసక్తికర ట్వీట్ చేశారు. తన దారిలో ఏది అడ్డొచ్చినా పట్టించుకోనని తేల్చి చెప్పారు.
"నా దారిలో ఏదైనా రానివ్వండి. నా విధి మాత్రం ఒక్కటే. ఇండియాను రక్షించడం. ఆ ఐడియాలజీని కాపాడడం"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
Come what may, my duty remains the same.
— Rahul Gandhi (@RahulGandhi) August 4, 2023
Protect the idea of India.
అటు కాంగ్రెస్ క్యాడర్‌లోనూ జోష్ పెంచింది ఈ తీర్పు. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ వద్ద కార్యకర్తలు సందడి చేశారు. రాహుల్‌కి శుభాకాంక్షలు చెప్పారు. మిఠాయిలు పంచుకున్నారు.
'असत्य पर सत्य की जीत हुई'
— Congress (@INCIndia) August 4, 2023
जय कांग्रेस, विजय कांग्रेस pic.twitter.com/yw0gXtdWE2
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ తీర్పుపై స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు.
"రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి దారి దొరికింది. ఈ తీర్పుని స్వాగతిస్తున్నాను. ఇది మా కూటమికి మరింత బలాన్నిస్తుంది. దేశం కోసం పోరాడడానికి శక్తినిస్తుంది. ఇది మన న్యాయ వ్యవస్థ సాధించిన విజయం"
- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం
I am happy with the news about the MP-ship of @RahulGandhi This will further strengthen the resolve of the INDIA alliance to unitedly fight for our motherland and win. A victory of the judiciary!
— Mamata Banerjee (@MamataOfficial) August 4, 2023సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందని ఎస్పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.
"దేశ ప్రజాస్వామ్యంపై, న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిన తీర్పు ఇది. రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే ఇవ్వడం గొప్ప విజయం. బీజేపీ ప్రతికూల రాజకీయాలకు ఈ ఒక్క తీర్పుతో చెక్ పడింది"
- అఖిలేష్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి
मा. सर्वोच्च न्यायालय ने राहुल गांधी जी की सज़ा पर रोक लगाकर भारतीय लोकतंत्र और न्यायपालिका में लोगों की आस्था को बढ़ावा दिया है।
— Akhilesh Yadav (@yadavakhilesh) August 4, 2023
भाजपा की नकारात्मक राजनीति का अहंकारी ध्वज आज उनके नैतिक अवसान के शोक में झुक जाना चाहिए।తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ కూడా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు.
"న్యాయమే గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను. ఇకపై రాహుల్ వాయనాడ్ ఎంపీగా కొనసాగొచ్చు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే ఇలాంటి తీర్పులు ఎంతో అవసరం"
- ఎమ్కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
Justice prevails! #Wayanad retains #RahulGandhi!
— M.K.Stalin (@mkstalin) August 4, 2023
Welcome the Hon'ble #SupremeCourt's decision staying the conviction of dear brother Thiru @RahulGandhi in the criminal defamation case. This decision reaffirms our belief in the strength of our judiciary and the importance of…
Also Read: రాహుల్ మళ్లీ ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతారా? సుప్రీం తీర్పుతో లైన్ క్లియర్ అయినట్టేనా!
Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!
CLAT Result 2024: క్లాట్-2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండిలా
Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి
Look Back 2023: 2023ని మర్చిపోలేని విధంగా చేసిన ఉత్తరకాశీ సొరంగం ఘటన - పాఠాలు నేర్పిన ప్రమాదం
Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
/body>