Supreme Court: గొంతు తగ్గించి మాట్లాడు, లేదంటే ఇక్కడ ఉండవ్ - లాయర్‌పై సీజేఐ తీవ్రంగా ఫైర్
Supreme Court Chief Justice: వాదన చేస్తున్న లాయర్ ను మధ్యలో ఆపి.. మర్యాదగా మాట్లాడాలని, కోర్టులో నిర్దేశిత గౌరవ ప్రమాణాలను పాటించాలని సీజేఐ గట్టిగా చెప్పారు.
Justice DY Chandrachud: సుప్రీంకోర్టులో నేడు (జనవరి 3) వాదనలు జరుగుతున్న సందర్భంగా సీజేఐ విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఓ లాయర్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కోర్టులో గొంతు తగ్గించి మాట్లాడాలని, ఇలాంటివి ఇక్కడికి చేయకూడదని గట్టిగా చెప్పారు. ఓ పిటిషన్ పై వాదనలు జరుగుతుండగా.. జస్టిస్ చంద్రచూడ్ కాస్త చిరాగ్గా కనిపించారు. వాదన చేస్తున్న లాయర్ ను మధ్యలో ఆపి.. మర్యాదగా మాట్లాడాలని, కోర్టులో నిర్దేశిత గౌరవ ప్రమాణాలను పాటించాలని గట్టిగా చెప్పారు. ‘‘వన్ సెకండ్.. మీ గొంతు తగ్గించండి. మీరు సుప్రీంకోర్టులో ప్రధాన బెంచ్ ముందు వాదనలు వినిపిస్తున్నారు. కాస్త తక్కువ స్థాయిలో మాట్లాడండి. లేదంటే.. మిమ్మల్ని కోర్టు నుంచి బహిష్కరిస్తాను’’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వార్నింగ్ ఇచ్చారు.
సదరు అడ్వకేట్ తరచూ ఇలాగే చేస్తున్నారని సీజేఐ ప్రస్తావించారు. ‘‘మీరు ఎక్కడున్నారో తెలుసా? జడ్జిల ముందు ఉన్న ప్రతిసారి మీరు ఇలాగే చేస్తున్నారా?’’ అని మాట్లాడారు. కోర్టు రూంలో సవ్యమైన ప్రవర్తన ఉండాల్సిన తీరును సీజేఐ ప్రస్తావించారు. ‘‘మీ గొంత తగ్గించండి. మీరు మీ స్వరం పెంచడం ద్వారా మాపై పై చేయి సాధించాలని అనుకుంటున్నట్లు అయితే మీరు పొరపాటు పడినట్లే. గత 23 ఏళ్లుగా ఇలా ఎప్పుడూ జరగలేదు. నేను సీజేఐ అయిన తర్వాత కూడా జరగలేదు’’ అని జస్టి్స్ చంద్రచూడ్ మాట్లాడారు. చీఫ్ జస్టిస్ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇవ్వడంతో సదరు అడ్వకేట్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. ధర్మాసనానికి క్షమాపణలు తెలిపి.. తన వాదనలను వినయంగా కొనసాగించారు.
మరో ఘటనలో ఓ అడ్వకేట్ కోర్టు రూంలో ఫోన్ లో మాట్లాడుతుండగా.. సీజేఐ చంద్రచూద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ మాట్లాడడానికి ఇదేమైనా మార్కెట్ అనుకుంటున్నావా? అతని ఫోన్ ను తీసుకొని సీజ్ చేయండి’’ అని అధికారులను ఆదేశించారు.
గత ఏడాది మార్చిలో, సుప్రీంకోర్టు లాయర్ల భూమికి సంబంధించిన విషయంలో వాదనలు జరుగుతుండగా.. ఇలాంటి ఘటనే జరిగింది. సుప్రీంకోర్టును కోరుతున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్‌పై జస్టిస్ చంద్రచూడ్ ‘‘నీ స్వరం తగ్గించు’’ అని గట్టిగా అరిచారు. ‘‘సైలెంట్ గా ఉండండి. ఈ కోర్టు హాల్ నుంచి ఇప్పుడే బయటికి పోండి. మీ స్వరంతో మమ్మల్ని భయపెట్టలేరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.