Kerala Floods: కేరళ వరదలు: రైలు ఆపేసి వేల ప్రాణాలు కాపాడిన వాచ్మెన్
Wayanad landslide Updates: కేరళను భారీ వర్షాలు అక్కడి జనాలను శోకసంద్రంలోకి నెట్టేశాయి. గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 88మంది సజీవ సమాధి కావడంతో కేరళ పెను విషాదంలో మునిగిపోయింది.
Kerala Floods 2024: కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో మంగళవారం ఉదయం సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 88 మంది మరణించారు, చాలా మంది గాయపడ్డారు. ఇది కాకుండా వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయారని, వారిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ వరదల సమయంలో ఓ వాచ్ మెన్ వందలాది మంది ప్రాణాలను కాపాడారు.
రైలుకు తప్పిన పెను ముప్పు.. అలర్ట్ అయిన వాచ్ మెన్
కేరళ వరదలకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రైల్వే ట్రాక్ పై వరద నీరు పొంగిపొర్లుతోంది. అంతేకాదు.. ఆ రైల్వే ట్రాక్ను ముంచెత్తేందుకు వరద నీరు వేగంగా పారుతోంది. ఆ సమయంలో రైలు ఆ పట్టాల పైకి వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఒక స్టేషనరీ వాచ్మెన్ అలర్ట్ అయి రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ నంబర్.16526 అదే సమయంలో ట్రాక్ మీదకు వస్తుండగా స్టేషనరీ వాచ్మెన్ రైలును ఆపాడు. దీంతో రైలు ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. కేరళలో వరదల కారణంగా వరద నీరు పట్టాల పైకి చేరడంతో రైల్వే శాఖ నాలుగు రైళ్లను రద్దు చేసింది. 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.
#WATCH | Kerala: Stationary watchman stopped train no. 16526 between Vallathol Nagar-Wadakkanchery of Trivandrum division due to heavy rain & water flow on track.
— ANI (@ANI) July 30, 2024
The following trains are partially cancelled today due to heavy water logging reported between Valathol Nagar and… pic.twitter.com/L2Cuye0dE4
Also Read: కేరళలో కన్నీరు పెట్టించే దృశ్యాలే - ఫోటోలు
కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో ఒక గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. కేరళ ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం, వైమానిక దళం, ఎన్‌డిఆర్‌ఎఫ్ అన్నీ అక్కడికి చేరుకున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. రాష్ట్రం నుంచి కేంద్రం వరకు యాక్టివ్ మోడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కేరళ ప్రభుత్వం మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో అధికారిక సంతాప దినాలు ప్రకటించింది.
రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతోంది?
ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. మలప్పురంలోని నిలంబూర్ ప్రాంతంలో ప్రవహించే చలియార్ నదిలో చాలా మంది గల్లంతయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ముండక్కైలో అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఘటనా స్థలానికి వెళ్లే వంతెన కొట్టుకుపోవడంతో రక్షించడంలో ఇబ్బంది ఏర్పడింది. తాత్కాలిక వంతెనలు నిర్మించేందుకు, హెలికాప్టర్ ద్వారా ప్రజలను తరలించేందుకు, విపత్తు జరిగిన ప్రాంతంలో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సైన్యం సహాయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ హామీ ఇచ్చారు.
వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు కూడా ఇప్పటికే అక్కడికే చేరుకున్నాయి. అయితే వర్షం కారణంగా ల్యాండింగ్ చేయడంలో ఇబ్బంది ఏర్పడింది. సంఘటనా స్థలానికి అదనపు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ని కూడా పంపించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీని కూడా రంగంలోకి దించారు. 225 మంది సైనికులతో సహా నాలుగు సైనిక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గాయపడిన వారికి సహాయం చేయడానికి వైద్య సిబ్బందిని కూడా ఆర్మీ యూనిట్లలో చేర్చారు.
Also Read: కేరళలో కన్నీరు పెట్టించే దృశ్యాలే - ఫోటోలు
వాయనాడ్ గ్రామాల్లో ఎంత నష్టం జరిగింది?
కొండచరియలు విరిగిపడటం వల్ల గ్రామాల్లో పెద్ద ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది. ముండక్కై, చురల్‌మల, అత్తమాల, నూల్‌పూజ గ్రామాల చిత్రం రూపురేఖలు మారి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు చాలా చోట్ల చెట్ల కొమ్మల్లో కూరుకుపోయి అక్కడక్కడా నీట మునిగాయి. ఉప్పొంగిన నదులు తమ పంథాను మార్చుకుని నివాస ప్రాంతాల్లోకి ప్రవహిస్తూ మరింత విధ్వంసం సృష్టిస్తున్నాయి. కొండలపై నుంచి పెద్దపెద్ద రాళ్లు దొర్లడం రెస్క్యూ సిబ్బందికి అడ్డంకులు సృష్టిస్తోంది. సహాయక చర్యల్లో నిమగ్నమైన ప్రజలు భారీ వర్షం మధ్య మృతదేహాలను, గాయపడిన వారిని అంబులెన్స్‌ల్లో తీసుకువెళ్లడం కనిపించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా పెద్ద ఎత్తున చెట్లు నేలకొరిగాయి. వరద నీరు పచ్చని ప్రాంతాలను నాశనం చేసింది.
పలు రైళ్లు రద్దు
వల్లథోల్ నగర్ - వడకంచెరి మధ్య వరద కారణంగా చాలా రైళ్లు రద్దు చేయబడ్డాయి. వీటిలో రైలు నంబర్ 16305 ఎర్నాకులం-కన్నూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను త్రిసూర్‌లో నిలిపివేశారు. రైలు నెం. 16791 తిరునెల్వేలి-పాలక్కాడ్ పాలరువి ఎక్స్‌ప్రెస్‌ను అలువా వద్ద నిలిపివేశారు. రైలు నెం. 16302 తిరువనంతపురం-షోరనూర్ వేనాడ్ ఎక్స్‌ప్రెస్‌ను చాలకుడి వద్ద నిలిపివేశారు.
కేరళ సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పి.విజయన్‌తో మాట్లాడారు. అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇస్తూ, మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు సహాయం ప్రకటించారు. వాయనాడ్ ప్రమాదంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు సురక్షితంగా బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి కేరళ సీఎంతో మాట్లాడారు. త్వరలో రాహుల్ గాంధీ కూడా వాయనాడ్‌లో పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: కేరళలో కన్నీరు పెట్టించే దృశ్యాలే - ఫోటోలు