అన్వేషించండి

Train Tickets: రైల్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌-ఇకపై టికెట్‌ కౌంటర్లలో యూపీఐ పేమెంట్స్‌

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూపీఐ పేమెంట్స్‌తో ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. టికెట్ కౌంటర్లలో డిజిటల్‌ పేమెంట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.

UPI payments for train tickets: రైలు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త పాలసీ తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే. టికెట్‌ కౌంటర్ల దగ్గర డిజిటల్‌ పేమెంట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల కష్టాలతో పాటు టికెట్‌ కౌంటర్ దగ్గర రైల్వే సిబ్బంది పడుతున్న బాధలను అర్థం చేసుకుని... ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. ఇకపై టికెట్‌ కొనేందుకు చిల్లర కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా టికెట్‌ కొనుక్కోవచ్చు. అంతేకాదు... రైల్వే కౌంటర్లలో డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయొచ్చు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం... మధ్యతరగతి ప్రజలకు ఊరట నిస్తోంది. 

సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే మధ్యతరగతి వారు ఎంచుకునేది రైలు ప్రయాణమే. అయితే రైలు టికెట్ల బుకింగే కొంచెం కష్టం. ముందస్తు ప్లాన్‌ ఉండి... 20, 30 రోజుల ముందే టికెట్‌ బుక్‌ చేసుకుంటే పర్వాలేదు. లేదంటే చుక్కలే. ఇక టికెట్‌ టికెట్‌ బుకింగ్‌ విషయానికి వస్తే... అవగాహన ఉన్న వాళ్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటారు. లేని వాళ్లు... రైల్వేస్టేషన్లలో టికెట్‌ కౌంటర్ల దగ్గరకు వెళ్లి.. టికెట్‌ రిజర్వ్‌ చేయించుకుంటారు. రైల్వే కౌంటర్లకు వెళ్లి... టికెట్‌ బుక్‌చేసుకోవాలంటే... చేతిలో డబ్బులు ఉండి తీరాల్సిందే. టికెట్‌కు సరిపడా చిల్లర లేకపోతే.. అదో సమస్య. ఇకపై అలాంటి సమస్యలు లేకుండా... సరికొత్త నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. డిజిటల్‌ పేమెంట్స్‌ విధానం ప్రవేశపెట్టి... అటు ప్రయాణికులకు... ఇటు టికెట్‌ కౌంటర్‌లోని సిబ్బందికి కాస్త రిలీఫ్‌ ఇస్తోంది.

ఇకపై... రైల్వే స్టేషన్‌లోని అన్ని టికెట్‌ కౌంటర్ల వద్ద యూపీఐ పేమెంట్స్‌ చేయవచ్చు. అందుకోసం... టికెట్‌ కౌంటర్‌ వద్ద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి యూపీఐ యాప్‌ ద్వారా చెల్లింపులు చేసేలా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. యూపీఐ యాప్‌ ద్వారా కానీ....  లేదా డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో చెల్లింపులు చేసే వీలు కల్పించింది. ఇందుకోసం.. ఇప్పటికే అన్ని రైల్వే స్టేషన్లలో 466 పీఓఎస్ మిషన్లు, యూపీఐ క్యూఆర్ కోడ్‌లను అమర్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్, అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్ సిస్టమ్ కౌంటర్లలో ఈ మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిజిటల్ సదుపాయాల్ని బలోపేతం చేయడానికే... రైల్వే టికెట్ కొనుగోలులో నగదు రహిత  విధానాల్ని ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ విధానం వల్ల రైల్వే ప్యాసింజర్ల సమయం ఆదా అవుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ కోసం గూగుల్ పే, ఫోన్ పే సహా పేటీఎం లాంటి డిజిటల్ చెల్లింపుల అప్లికేషన్స్ వాడుతున్నారు. తాజాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ అనువుగా ఉంటుంది అధికారులు భావిస్తున్నారు. చిల్లర కష్టాలు తీరడమే కాకుండా.... టిక్కెట్టు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయంపై రైలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనరల్‌ టికెట్‌ కూడా డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా కొనుక్కోవచ్చని... సంబర పడుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget