SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే
సేవా కార్యక్రమాల్లో కలసి రావాలని సోనుసూద్ పిలుపునిస్తున్నారు. అడాప్ట్ ఏ పెషంట్ పేరుతో ఉద్యమం ప్రారంభించారు.
SonuSood Foundation : బాలీవుడ్ నటుడు సోనుసూద్ గొప్ప ప్రజా సేవకుడిగా దేశ ప్రజల మనసుల్లో ముద్ర వేసారు. సూద్ ఫౌండేషన్ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు.. చారిటీ ఈవెంట్లు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన్ను సహాయం కోరుతూ కొన్ని వేల అప్లికేషన్లు సోనూసూద్‌కు వస్తున్నాయి. దీంతో ఆయన తనతో కలిసి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నారు.
'నేను వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ... మీరు నాతో చేతులు కలపకుండా ఈ ప్రయాణం పూర్తి కాదు. మరో ప్రాణాన్ని రక్షించడంలో నాతో చేరండి' అని పోస్ట్ షేర్ చేశారు. అందులో సోనుసూద్ పక్కన ఆయనకు వచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి. మరికొన్నాళ్ల పాటు చారిటీ కార్యక్రమాలు నిర్విరామంగా సాగడానికి ఆయన అందర్నీ సహాయం కోరారు.
I receive thousands of requests daily & I try to save as many lives as I can. But, this journey cannot be complete without you joining hands with me. Join me in Helping Save One More Life.
— sonu sood (@SonuSood) May 27, 2022
Details on https://t.co/juJL7WjwyQ@SoodFoundation🇮🇳 pic.twitter.com/PGZzNluIaL
`మానవ సేవయే మాధవ` సేవ అన్న నానుడి సరిగ్గా సోనూసూద్ కి సరిపోయే తీరున ఆయన సేవలు కరోనా సమయంలో కొనసాగాయి. అప్పటి నుంచి సోనూసూద్ సేవాక కార్యక్రమాలు మరింత విస్తృతం అవుతున్నాయి. చేయి చేయి కలిస్తేనే ఏ పని అయినా సులభం అవుతుంది. మరింత మందికి సహాయం అందుతుంది. మరికొన్నాళ్ల పాటు చారిటీ కార్యక్రమాలు నిర్విరామంగా సాగడానికి అవకాశం ఉంటుందనేది సోనుసూద్ ఉద్దేశం
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికుల్ని ప్రత్యేక బస్సులేసి స్వస్థలాలకు తరలించి రియల్ హీరో అయ్యారు. ఈ ఒక్క ఘటన సోనుసూద్ ని ప్రజల్లో దేవుణ్ణి చేసింది. ప్రభుత్వమే ఎలాంటి చర్యలు తీసుకోకుండా గమ్మునుంటే సోనుసూద్ మాత్రం నేను ఉన్నానంటూ ముందుకొచ్చి అదుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా అవసరమైన రోగులకు కావాల్సిన మందులు సొంత డబ్బుతో కొనుగోలు చేసి పంపించడం నుంచి కరోనా రక్కసి ప్రాణాలు తీస్తున్న సమయంలో ఆక్సీజన్ సిలిండర్లు ఏర్పాటు చేయడం వరకూ ఎన్నో సహా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికీ నిర్వహిస్తున్నారు.