Sonia Gandhi Discharged: గంగారామ్ ఆసుపత్రి నుంచి సోనియాగాంధీ డిశ్చార్జ్- జూన్ 23న ఈడీ విచారణ
సోనియా ఆసుపత్రికి చికిత్స పొందుతున్న టైంలో శ్వాసకోశ సమస్యలో బాధపడ్డట్టు వైద్యులు వెల్లడించారు. కరోనా కారణంగా సోనియా గాంధీ ముక్కు నుంచి బ్లీడింగ్ అయిననట్టు జైరాం రమేష్ జూన్ 15న ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సంబంధిత సమస్యలతో సోనియా గాంధీ దిల్లీలోని శ్రీ గంగారామ్ హాస్పిటల్ చికిత్స తీసుకున్నారు. సోనియా గాంధీ గంగారామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జ్ జైయరామ్ ట్వీట్ చేశారు.
Congress President Smt. Sonia Gandhi has been discharged from Sir Ganga Ram Hospital this evening and advised rest at home.
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 20, 2022
సోనియా గాంధీ ఆసుపత్రికి చికిత్స పొందుతున్న టైంలో శ్వాసకోశ సమస్యలో బాధపడ్డట్టు వైద్యులు వెల్లడించారు. కరోనా కారణంగా సోనియా గాంధీ ముక్కు నుంచి బ్లీడింగ్ అయిననట్టు గతంలో జైరాం రమేష్ జూన్ 15న ట్వీట్ చేశారు
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జూన్ 23న విచారణకు హాజరుకావాలని 75 ఏళ్ల సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసింది.
A statement on Congress President’s health condition. pic.twitter.com/4tVBtgyhEi
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 17, 2022
జూన్ 8న ఈడీ ముందు హాజరు కావాలని ముందు ఇచ్చిన నోటిస్‌లో పేర్కొన్నారు. జూన్ 2న తనకు కరోనా సోకిందని ఈడీకి చెప్పడంతో మరోసారి నోటీస్ జారీ చేసి జూన్ 23న రావాల్సిందే దర్యాప్తు సంస్థ చెప్పింది.
ఇదే కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోనియా గాంధీ కుమారుడు, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని నాలుగో రోజు కూడా ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా దేశం మొత్తం నిరసనలు తెలుపుతున్న తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడం కూడా జరిగింది.
అగ్నిపథ్ పథకంపై సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. యువత గొంతును ప్రభుత్వం విస్మరించడం దురదృష్టకరమని అన్నారు.
"ప్రభుత్వం మీ డిమాండ్‌లను విస్మరించి, పూర్తిగా దిశ లేని కొత్త పథకాన్ని ప్రకటించినందుకు నేను విచారంగా ఉన్నాను" అని సోనియా గాంధీ అన్నారు. చాలా మంది మాజీ సైనికులు, రక్షణ నిపుణులు కూడా ఈ పథకంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఆందోళన చేస్తున్న యువతకు అండగా నిలుస్తామని, అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునేందుకు కృషి చేస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారు.
తమ డిమాండ్ల కోసం పోరాడేందుకు శాంతియుత, అహింసా మార్గాలను ఎంచుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు యువతకు విజ్ఞప్తి చేశారు.