అన్వేషించండి

Snake Skin In percel : పరోటా పార్శిల్‌లో పాము చర్మం - ఆ కస్టమర్ ఏం చేశాడంటే ?

ఫుడ్ పార్శిల్‌లో పాము చర్మం కూడా కట్టి ఇచ్చారు ఆ హోటల్ నిర్వాహకులు. కానీ కస్టమర్ కనిపెట్టేశాడు. ఆ తర్వాతే అసలు సినిమా ప్రారంభమయింది.

ధాయ్‌లాండ్, చైనా లాంటి దేశాలతో  "స్నేక్ స్పెషల్"  మెనూ ఉంటుందని మనం సార్లు విన్నాం. సోషల్ మీడియా వచ్చాక కొన్ని వీడియోలు కూడా చూసి ఉంటారు. విన్నప్పుడల్లా.. చూసినవప్పుడల్లా " హవ్వ ... తినేవాళ్లు మనుషులేనా" అని అనుకోవడం సహజం. అలాంటి మన దగ్గర ఓ ఫుడ్ పార్శిల్‌లో పాము చర్మం కనిపిస్తే ఎలా ఉంటుంది ? ఊహించడం కష్టం. అలాంటి చాన్సే ఉండదని మనం అనుకుంటాం... కానీ కేరళలో అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగింది. 

టాటా స్టీల్ జంషెడ్‌పూర్ ప్లాంట్ పేలుడు- కోక్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కేరళ రాజధాని తిరువనంతపురం శివారులో చెల్లంకోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి సమీప హోటల్‌కు వెళ్లి పరోటా పార్శిల్ తెచ్చుకున్నాడు. ఇంటికి వెళ్లి పార్శిల్ విప్పి తిందామని చూస్తే పరోటా కంటే ముందే అతనికి  చర్మం లాంటిదేదో కనిపించింది. అదేంటా అని పరిశీలనగా చూస్తే ఒక్క సారిగా షాక్ కొట్టినట్లయింది.అయితే పాము చర్మం.  నాలుగైదు ఇంచ్‌ల పొడవున్న ఆ పాము చర్మాన్ని చూడగానే ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అలా వదిలేస్తే ఆ హోటల్ వాళ్లు ఈ సారి పాముల్నే పంపుతారని అనుకున్నాడేమో నేరుగా వెళ్లి ఫుడ్ సేప్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ప్రజలకు మార్నింగ్ షాక్- సిలిండర్‌పై రూ. 50 పెంపు, వెయ్యి రూపాయలు దాటేసిన సిలిండర్

ఫుడ్ సేప్టీ అధికారులు కూడా పార్శిల్‌లోకి పాము స్కిన్ ఎందుకు వస్తుంది అని తేలిగ్గా తీసుకోలేదు. సీరియస్‌గా తీసుకుని వెంటనే ఆ హోటల్‌లో  తనిఖీలు చేశారు. కిచెన్ మొత్తం దారుణంగా ఉండటంతో వెంటనే సీజ్ చేశారు. అయితే ఆ  హోటల్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని అదికారులు చెబుతున్నారు. హోటల్ కమస్టర్‌కు ఇచ్చిన పాము చర్మం ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై ఆరా తీశారు. అయితే హోటల్ వాళ్లు కూడా ఏమీ చెప్పలేకపోయారు. దీంతో ఆ కస్టమర్ ఇచ్చిన పాముచర్మంతో పాటు హోటల్‌లో స్వాధీనం చేసుకున్న తినుబండారాలు.. ఇతర పదార్థాల్ని ల్యాబ్‌కు పంపారు. రిపోర్ట్ రావాల్సి ఉంది. 

వెక్కి వెక్కి ఏడ్చిన నవనీత్ రాణా- ఓదార్చిన భర్త, వీడియో వైరల్!

కేరళలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే పేపర్లలో ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాల్ని పార్శిల్ చేయడాన్ని నిషేధించారు. అయితే చాలా హోటళ్లు వాటిని పాటించడం లేదు. ల్యాబ్‌లో కూడా అది పాము చర్మమే అని నిర్ధారణ అయితే అసలు కలకలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget